కారు మాకెక్కడిదీ!
ABN, First Publish Date - 2023-01-03T03:08:42+05:30
చిత్తూరు, జనవరి 2: పూట గడవడమే కష్టంగా ఉండే ఆ పేదరాలి కొడుక్కి రేంజ్‌రోవర్ కారు ఉందంటూ ఆమె పింఛను కోసేశారు. చిత్తూరులోని 39వ డివిజన్‌కు చెందిన అహ్మద్ రహీమాబీ (70)కి నెలనెలా వచ్చే వృద్ధాప్య పింఛను ఈ నెల రాలేదు. ఆమె
కొడుక్కి రేంజ్ రోవర్ ఉందని పింఛను కోసేశారు
వృద్ధురాలు లబోదిబో ఒంగోలులో దివ్యాంగుల కన్నెర్ర
రేంజ్ రోవర్ కారుందని.. పింఛన్ కట్
వృద్ధురాలు లబోదిబో
చిత్తూరు, జనవరి 2: పూట గడవడమే కష్టంగా ఉండే ఆ పేదరాలి కొడుక్కి రేంజ్‌రోవర్ కారు ఉందంటూ ఆమె పింఛను కోసేశారు. చిత్తూరులోని 39వ డివిజన్‌కు చెందిన అహ్మద్ రహీమాబీ (70)కి నెలనెలా వచ్చే వృద్ధాప్య పింఛను ఈ నెల రాలేదు. ఆమె వలంటీరుని అడిగింది. జాబితాలో పేరు లేదని చెప్పడంతో కొడుకుతో కలిసి సచివాలయానికి పరుగు తీసింది. ఆన్‌లైన్‌లో పరిశీలించిన సిబ్బంది ‘మీ అబ్బాయి పేరుతో ఏపీ03 ఏక్యూ 0555 నంబరుతో రేంజ్‌రోవర్ కారు ఉంది. అందుకే పింఛను ఆగిపోయింది’ అని చెప్పారు. ఒక నిర్మాణ సంస్థలో కార్మికుడిగా పనిచేసే తనకు రేంజ్ రోవర్ కారు ఉండడం ఏమిటో ఆమె కొడుక్కి అంతుపట్టలేదు. తనకు కారు లేదంటూ ఆయన సోమవారం నగరపాలక సంస్థ స్పందన కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నంబరు రేంజ్ రోవర్ కారు చిత్తూరు నగరంలోని ఒక ముఖ్య నాయకుడికి ఉందని అంటున్నారు.
Updated Date - 2023-01-03T03:08:43+05:30 IST