ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IT: భారతీయ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం!

ABN, First Publish Date - 2023-10-12T20:56:51+05:30

అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ భారత్‌తోని ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కొన్ని సందర్భాలు మినహా మిగతా ఉద్యోగులందరికీ ఈ ఏడాది అధిక బోనస్‌లు, శాలరీ పెంపు ఉండదని పేర్కొంది.

ఇంటర్నెట్ డెస్క్: ఐటీ రంగం పలు సవాళ్లతో సతమతమవుతోంది. డిమాండ్ తగ్గతుండటంతో అనేక సంస్థలు లాభాల కోసం చమటోడ్చాల్సి వస్తోంది. ఈ క్రమంలో కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్(Accenture) భారత్‌లోని ఉద్యోగులకు(Indian employees) భారీ షాకిచ్చింది. కొన్ని సందర్భాలు మినహా మిగతా ఉద్యోగులందరికీ ఈ ఏడాది అధిక బోనస్‌లు(Bonus), శాలరీ పెంపు(Salary Hike) ఉండదని పేర్కొంది. శ్రీలంకలోని ఉద్యోగులకు కూడా ఇదే తరహా ఈమెయిల్ పంపించింది.


శాలరీ పెంపు ఉండదంటూ యాక్సెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజెయ్ విజ్ భారత్‌లోని ఉద్యోగులకు ఈ-మెయిల్‌లో తెలియజేశారు. అయితే, చట్టపరమైన నిబంధనలు అమలు లేదా క్రిటికల్ నైపుణ్యాలు అవసరమై సందర్భాల్లో ఇది వర్తించదని స్పష్టం చేశారు. సంస్థపై భారం లేని విధంగా అభ్యర్థుల నైపుణ్యాలు, వారి పని ప్రదేశం ఆధారంగా కాంపిటీటివ్ పే విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. కాబట్టి, ప్రాథమిక పెంపు అందరికీ వర్తించదని స్పష్టం చేశారు. ఇక వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఇచ్చే బోనస్‌లు కొనసాగుతాయని, అయితే ఇవి మునుపటి కంటే చాలా తక్కువగా ఉంటాయని చెప్పారు. ఇక, ప్రమోషన్ల విషయంలోనూ కంపెనీ ఆచుతూచి అడుగులు వేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈమారు ఉద్యోగుల ప్రమోషన్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

మునుపటి అంచనాల ప్రకారం అభివృద్ధి లేకపోవడంతో యాక్సెంచర్ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. సెప్టెంబర్-ఆగస్టు ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించే యాక్సెంచర్ ఈ ఏడాది 19 వేల మందిని తొలగించే యోచనలో ఉన్నట్టు మార్చిలో ప్రకటించింది.

Updated Date - 2023-10-12T21:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising