Adani: రూ.1500 కోట్ల అప్పును తిరిగి చెల్లించిన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్

ABN, First Publish Date - 2023-02-20T21:31:25+05:30

హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ తాజాగా 1500 కోట్ల బాకీని తిరిగి చెల్లించింది.

Adani: రూ.1500 కోట్ల అప్పును తిరిగి చెల్లించిన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక(Hindenburg report) నేపథ్యంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(Adani ports and Sez) సంస్థ తాజాగా 1500 కోట్ల బాకీని తిరిగి చెల్లించింది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌(SBI Mutual Funds)లోన్‌లో రూ.1500 కోట్లను సోమవారం చెల్లించింది. కమర్షియల్ పేపర్స్(Commercial Papers) కింద మరో వెయ్యి కోట్లనూ త్వరలో చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కంపెనీ వద్ద ఉన్న నిధులు, కార్యకలాపాల ద్వారా అందిన ఆదాయంతో ఈ ముందుస్తు చెల్లింపు జరిపామని సంస్థ పేర్కొంది. సంస్థకున్న నిధుల లభ్యతపై మార్కెట్లకున్న నమ్మకం ఈ ఉదంతంతో రుజువైందని కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

అదానీ గ్రూప్ సంస్థలు అప్పులకుప్పగా మారాయంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ భారీగా పడిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన నాటి నుంచి నేటి వరకూ అదానీ సంస్థలు ఏకంగా 120 బిలియన్ డాలర్లు నష్టపోయాయని ఓ అంచనా. దీంతో.. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారు, ఆప్పులు ఇచ్చినా వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే..అదానీ గ్రూప్ తొలి నుంచీ హిండెన్‌బర్గ్ నివేదికను ఖండిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. అదానీ గ్రూప్ నష్టనివారణ చర్యలకూ ఉపక్రమించింది.

సంస్థలో నిధుల లభ్యత తగ్గిందన్న భయాలను తొలగించేందుకు పలు చర్యలు చేపట్టింది. Kekst CNC సంస్థను సలహాదారుగా నియమించుకుంది. మరోవైపు.. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై న్యాయపోరాటం చేసేందుకు అదానీ గ్రూప్ అమెరికా లా కంపెనీ వాచల్‌ను కూడా నియమించుకుంది.

Updated Date - 2023-02-20T21:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising