ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jio Airtel: రోజూ 2.5 జీబీ డేటా వాడే జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లు తప్పనిసరిగా...

ABN, First Publish Date - 2023-05-19T21:15:46+05:30

దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) తమ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటాతో పలు ప్లాన్స్ అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం డైలీ కోటాపై ఆధారపడి ఉంటుంది. అంటే డేటా హైస్పీడ్ లిమిట్ పూర్తయితే ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదించి 65 కేబీపీఎస్‌కు పడిపోతుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) తమ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటాతో పలు ప్లాన్స్ అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం డైలీ కోటాపై ఆధారపడి ఉంటుంది. అంటే డేటా హైస్పీడ్ లిమిట్ పూర్తయితే ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదించి 65 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ స్పీడ్‌తో డేటాను ఉపయోగించుకోలేం. మహా అయితే నోటిఫికేషన్లు వస్తుంటాయి. అందుకే ఈ రెండు కంపెనీలు అందించే అధిక డేటా ప్లాన్స్.. అంటే రోజుకు 2.5 జీబీ డైలీ డేటా ప్లాన్స్‌ను యూజర్లు సెలెక్ట్ చేసుకుంటుంటారు. తద్వారా రోజంతా హై-స్పీడ్ డేటాను ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. అయితే రోజుకు 2.5 జీబీ డైలీ డేటా ప్లాన్స్ వ్యాలిడిటీ 30 రోజుల నుంచి 1 ఏడాది వరకు ఉంటున్నాయి. మరి రోజుకు 2.5 జీబీ డేటాతోపాటు కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు, ఇతర ఓటీటీ బెనిఫిట్స్ ఏమున్నాయో చూద్దాం...

డైలీ 2.5 జీబీ డైలీ డేటాతో ఎయిర్‌టెల్ అందిస్తున్న ఆఫర్లు ఇవే...

ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్...

ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ రోజుకు 2.5 జీబీ డేటా ఆఫర్ చేస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 110 ఎస్ఎంఎస్‌లు అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే.. క్వాటర్లీ ప్లాన్స్‌లో 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్న అర్హత కలిగిన యూజర్లు 84 రోజులపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందొచ్చు. అంతేకాదు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ యాక్సెస్‌తోపాటు మరిన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.

ఎయిర్‌టెల్ రూ.3359 ప్లాన్....

డైలీ 2.5 జీడీ డైలీ డేటా అందిస్తున్న ఈ ప్లాన్ వార్షిక వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. 365 రోజలుపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే... అర్హత కలిగిన యూజర్లు అపరిమిత 5జీ డేటాను వాడుకోవచ్చు. ఏడాదిపాటు డిస్నీ+ హాస్ట్‌స్టార్ మొబైల్ సబ్‌స్ర్కిప్షన్, అపోలో 24/7 సర్కిల్ బెనిఫిట్స్‌తోపాటు ఇతర ప్రయోజనాలు పొందొచ్చు.

డైలీ 2.5 జీబీ డేటాతో జియో అందిస్తున్న ప్రీపేయిడ్ ప్లాన్స్ బెనిఫిట్స్ ఇవే...

జియో రూ.349 ప్లాన్...

30 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న ఈ ప్లాన్‌లో డైలీ 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 75 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక అదనపు ప్రయోజనాల్లో జియో టీవీ, జియో సినిమా, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ లభిస్తుంది. ప్రస్తుతం జియో సినిమాలో ఐపీఎల్ 2023 సీజన్ ఉచితంగా లైవ్ స్ట్రీమ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్లాన్‌లో జియో యూజర్లు జియో 5జీ నెట్‌వర్క్ ఏరియాలో అపరిమిత 5జీ డేటాను పొందొచ్చు.

జియో రూ.899 ప్లాన్...

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అంటే దాదాపు 3 నెలల్లో మొత్తం 225 జీబీ డేటా లభిస్తుంది. డైలీ డేటా పరిమితి 2.5 జీబీగా ఉంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాల్లో జియో యాప్స్‌కు ఉచితంగా యాక్సెస్, అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

జియో రూ.2023 ప్లాన్..

ఈ ప్లాన్‌‌ వ్యాలిడిటీ 252 రోజులుగా ఉంది. డైలీ 2.5 జీబీ లిమిట్ చొప్పున మొత్తం 630 జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. డైలీ 2.5 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2023-05-19T21:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising