ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Airtel Jio: మీరు ఎయిర్‌టెల్ లేదా జియో సిమ్ వాడుతున్నారా?.. మరి ఈ ఆఫర్లు తెలుసా.. ఎంచక్కా డైలీ 2 జీబీ డేటా..

ABN, First Publish Date - 2023-02-20T20:08:59+05:30

మీరు ఎయిర్‌టెల్(Airtel), జియో(Reliance Jio) సిమ్‌లు వాడుతున్నారా? అయితే, మీకిది శుభవార్తే. ఈ రెండు టెల్కోలు పలు ఆఫర్లతో ఖాతాదారులను ఆకర్షించే ప్లాన్లు తీసుకొస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మీరు ఎయిర్‌టెల్(Airtel), జియో(Reliance Jio) సిమ్‌లు వాడుతున్నారా? అయితే, మీకిది శుభవార్తే. ఈ రెండు టెల్కోలు పలు ఆఫర్లతో ఖాతాదారులను ఆకర్షించే ప్లాన్లు తీసుకొస్తున్నాయి. ఈ రెండు టెలికం సంస్థలు దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. 5జీ సేవల వల్ల బోల్డన్ని ప్రయోజనాలున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. 4కె సినిమాను 5జీ యూజర్లు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారు. అదే 4జీ వినియోగదారులైతే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ఫైళ్లు, యాప్స్ కూడా 5జీలో వేగంగా, హై క్వాలిటీలో లోడవుతాయి. కాబట్టి మీరు కనుక 5జీ ఫోన్ ఉపయోగిస్తుంటే డైలీ డేటాకు సంబంధించిన ఆఫర్లను తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి రోజువారీ 2 జీబీ డేటాను ఆఫర్ చేస్తున్న ఎయిర్‌టెల్, జియో ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

* ఎయిర్‌టెల్ రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ ‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు లభిస్తాయి. కాలపరిమితి 28 రోజులు

* ఎయిర్‌టెల్ రూ. 319 ప్రీపెయిడ్ ప్లాన్‌లో నెల రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఇందులో కూడా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు లభిస్తాయి.

* ఎయిర్‌టెల్ రూ. 359 ప్రీపెయిడ్ ప్లాన్‌ నెల రోజుల కాలపరిమితితో వస్తుంది. రోజుకు 2జీబీతో అపరిమిత డేటా లభిస్తుంది. వీటితోపాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు కూడా ఉంటాయి.

* ఎయిర్‌టెల్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల కాలపరిమితితో అపరిమత కాలింగ్ సౌకర్యంతోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల కాలపరిమితితో లభిస్తుంది.

* ఎయిర్‌టెల్ రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల కాలపరిమితితో రోజుకు 3జీబీ డేటాను పొందొచ్చు.

* ఎయిర్‌టెల్ రూ. 549 ప్లాన్‌ అపరిమిత కాలింగ్ సౌకర్యంతోపాటు రోజుకు 2జీబీ డేటా 56 రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు మామూలే.

* ఎయిర్‌టెల్ రూ. 699 ప్లాన్‌ 56 రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉంది. రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు వంటి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.

* ఎయిర్‌టెల్ రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మూడు నెలల మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలతో కూడిన ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు.

* ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్ 2.5జీబీ డైలీ డేటాను ఆఫర్ చేస్తోంది. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మూడు నెలల మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు లభిస్తాయి. ప్లాన్ కాలపరిమితి 84 రోజులు.

* ఎయిర్‌టెల్ రూ. 2,999 ప్లాన్‌ ఏడాది కాలపరిమితితో అందుబాటులో ఉంది. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు 2జీబీ డైలీ డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

* రూ. ఎయిర్‌టెల్ రూ.3,359 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటా ఏడాది కాలపరిమితితో అందుబాటులో ఉంది. రూ. 2,999 ప్లాన్‌‌లో లభించే అన్ని ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. అలాగే, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తోపాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ సంవత్సరం పాటు ఉచితంగా లభిస్తుంది.

జియో ప్లాన్లు

* రిలయన్స్ జియో రూ. 249 ప్లాన్‌ కాలపరిమితి 23 రోజులు. రోజుకు 2జీబీతో అపరిమిత డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

* రిలయన్స్ జియో రూ. 299 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు జియో యాప్స్, సర్వీసుల ప్రయోజనాలు లభిస్తాయి.

* రిలయన్స్ జియో రూ. 533 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉంది. అపరిమిత కాలింగ్, 2జీబీ డైలీ డేటా, జియో యాప్స్, సర్వీసుల ప్రయోజనాలు ఉంటాయి.

* రిలయన్స్ జియో రూ. 2,879 ప్రీపెయిడ్ ప్లాన్‌ 365 రోజుల కాలపరిమితితో వస్తోంది. ఇందులో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఇందులో కూడా జియో యాప్స్, సర్వీసులు ఉపయోగించుకోవచ్చు.

* రిలయన్స్ జియో రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్, సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

* జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డైలీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్, సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

* జియో రూ. 2023 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్ సర్వీసుల ప్రయోజనాలు లభిస్తాయి.

* రియలన్స్ జియో రూ. 419 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. అలాగే, రోజుకు100 ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్, సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2023-02-20T20:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising