ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amazon: అమెజాన్ ఉద్యోగులకు కీలక హెచ్చరిక.. ఏకంగా సీఈవోనే అంత మాటన్నారంటే..

ABN, First Publish Date - 2023-08-29T21:33:54+05:30

అమెరికాకు చెందిన దిగ్గజ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ అమెజాన్ సంస్థ (Amazon) ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ ఉద్యోగి ఆఫీస్‌కు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు అమెజాన్ సీఈవో ఆండీ జాసీ (Amazon CEO Andy Jassy) స్పష్టం చేశారు.

అమెరికాకు చెందిన దిగ్గజ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ అమెజాన్ సంస్థ ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ ఉద్యోగి ఆఫీస్‌కు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు అమెజాన్ సీఈవో ఆండీ జాసీ స్పష్టం చేశారు. ఆఫీస్‌కు వచ్చి పనిచేసేందుకు సిద్ధంగా లేని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడేది లేదని అమెజాన్ కాస్తంత సీరియస్‌గానే ఉద్యోగులను హెచ్చరించింది. ఆఫీస్‌కు వచ్చి పనిచేసేందుకు సిద్ధంగా లేని ఉద్యోగులు మరో ఉద్యోగం చూసుకోవచ్చని, అమెజాన్ అలాంటి వాళ్లకు సరైన వర్క్‌ప్లేస్ కాదని ఈ మల్టీనేషనల్ కంపెనీ కుండబద్ధలు కొట్టింది. "It's not going to work out for you" అని అమెజాన్ సీఈవోనే ఉద్యోగులను హెచ్చరించడం గమనార్హం.


గత మే నుంచి మూడు రోజుల పాటు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని అమెజాన్ ఉద్యోగులకు స్పష్టం చేసింది. అయితే.. అమెజాన్‌లో పనిచేసే మెజార్టీ ఉద్యోగులు ఈ ప్రతిపాదన పట్ల విముఖత వ్యక్తం చేశారు. ఏకంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక పిటిషన్ కూడా సంస్థకు పంపారు. అయినప్పటికీ ఈ ప్రతిపాదన విషయంలో అమెజాన్ వెనక్కి తగ్గలేదు.

ఉద్యోగులతో జరిగిన కీలక సమావేశంలో కూడా అమెజాన్ సీఈవో ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలన్న ప్రతిపాదన నచ్చని ఉద్యోగులు ఎంచక్కా మరో ఉద్యోగం చూసుకోవచ్చని కరాఖండిగా అమెజాన్ సీఈవో ఆండీ జాసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు సీఈవో నుంచే ఉద్యోగులకు ఈమెయిల్ వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. లే-ఆఫ్స్ గురించి కూడా అమెజాన్ ఆలోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆఫీస్‌కు రావడానికి సిద్ధంగా లేని ఉద్యోగులను తీసేసేందుకు అమెజాన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కొంతమంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విషయంగా వెనక్కి తగ్గేదే లేదని, అమెజాన్‌లో ఉద్యోగాన్ని వదులుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారట.

Updated Date - 2023-08-29T21:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising