ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazon Layoffs: ఇండియాలో అమెజాన్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-01-15T19:52:22+05:30

జాబ్ పోయిందని తెలుసుకున్న అమెజాన్ ఉద్యోగులు సంస్థ కార్యాలయంలోనే కన్నీటి పర్యంతమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసు అంతా కమ్ముకున్న నిరాశాజనక వాతావరణం.. జాబ్ పోయిందని(Layoffs) తెలుసుకుని కూలబడిపోతున్న ఉద్యోగులు.. బాధ తట్టుకోలేక ఆఫీసులోనే కన్నీళ్లు పెట్టుకుంటున్న వైనం.. ప్రస్తుతం ఇండియాలోని అమెజాన్(Amazon India) ఉద్యోగుల(Employees) పరిస్థితి ఇది. అకస్మాత్తుగా ఉపాధి కోల్పోయిన కోలీగ్స్‌ను చూసి చెలించిపోయిన ఓ అమెజాన్‌ ఉద్యోగి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన పేరు, ఇతర వివరాలు బయటపడకుండా జాగ్రత్తపడుతూనే అతడు తన వ్యధను నెటిజన్లతో పంచుకున్నాడు.

వృత్తినిపుణుల కమ్యూనిటీ యాప్ గ్రేప్ వైన్‌లో ఈ పోస్ట్ తొలిసారి కనిపించింది. ‘‘నా టీంలో 75 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. కానీ నా జాబ్ పోలేదు. అయినా కూడా నాకు పనిచేయాలన్న ఉత్సాహం లేకుండా పోయింది. కాస్తంత ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఆఫీసులో కొందరు కన్నీటి పర్యంతమవుతున్నారు. వారి దీనస్థితిని చూసి తట్టుకోలేక నేను రాత్రి నాలుగు బీర్లు తాగా.. అయినా కూడా కంటి మీద కునుకు రాలేదు. రేపు కూడా సెలవు పెట్టేశా. పరిస్థితి దారుణంగా ఉంది’’ అంటూ అతడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఏకంగా 18 వేల మంది ఉద్యోగులను అమెజాన్‌ తొలగించబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌లోనూ ఉద్వాసనలు ఉంటాయని అమెజాన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత నెలకొన్న కారణంగా ఉద్వాసనలు తప్పవని అమెజాన్ సీఈఓ యాండీ జస్సీ తేల్చి చెప్పారు. అమెజాన్‌తో పాటూ ఫేస్‌బుక్, ట్విటర్, మెటా, గూగుల్ వంటి టెక్ సంస్థలన్నీ ఉద్యోగుల తొలగింపునకే మొగ్గు చూపుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం అనిశ్చితిలో కూరుకుపోయింది.

Updated Date - 2023-01-15T19:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising