ITC Hotels : ఐటీసీ హోటళ్ల వ్యాపారం విభజన
ABN, First Publish Date - 2023-07-25T03:22:11+05:30
విభిన్న వ్యాపార రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీసీ లిమిటెడ్ హోటళ్ల విభాగాన్ని ప్రత్యేక వ్యాపారంగా విభజించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ పేరిట పూర్తి యాజమాన్య సంస్థ
పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ ఏర్పాటు
న్యూఢిల్లీ: విభిన్న వ్యాపార రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీసీ లిమిటెడ్ హోటళ్ల విభాగాన్ని ప్రత్యేక వ్యాపారంగా విభజించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ పేరిట పూర్తి యాజమాన్య సంస్థ ఏర్పా టు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందువల్ల ఆ విభాగంలోకి తగినన్ని పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇన్ని సంవత్సరాల కాలంలో హోటళ్ల వ్యాపారం పరిణతి చెందిందని, వేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య పరిశ్రమలో తనంత తానుగా వృద్ధి బాటలో పయనించగల సామర్థ్యం సాధించిందని తెలిపింది. ‘‘సోమవారం (జూలై 24) నిర్వహించిన డైరెక్టర్ల బోర్డు సమావేశం హోటల్ వ్యాపారాలకు చెందిన వివిధ ప్రత్యామ్నాయాలపై చర్చించి, మదింపు చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆ విభాగం డీమెర్జర్‌కు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఈ వ్యాపార నిర్వహణ కోసం పూర్తి యాజమాన్యంలోని ప్రత్యేక అనుబంధ సంస్థ ఏర్పాటుకు కూడా ఆమోదించింది’’ అని తెలిపింది. ఐటీసీకి 40ు వాటా: కొత్త వ్యాపార విభాగంలో ఐటీసీకి 40 ఽశాతం వాటా ఉంటుందని, మిగతా 60 శాతం వాటాలు కంపెనీ వాటాదారులకు వారి చేతిలోని షేర్ల నిష్పత్తికి అనుగుణంగా లభిస్తాయని ఐటీసీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ డీమెర్జర్ స్కీమ్‌ను ఆగస్టు 14వ తేదీన జరగనున్న సమావేశంలో బోర్డు అనుమతికి పెడతామని తెలియచేసింది. ఈ డీమెర్జర్ ప్రక్రియ పూర్తి కావడానికి 9 నుంచి 12 నెలల కాలం పడుతుందని, ప్రతి ఒక్క వాటాదారుకు వారి వద్ద గల 100 షేర్లకు కొత్త విభాగానికి చెందిన 60 షేర్లు లభిస్తాయని విశ్లేషకులంటున్నారు.
70 ప్రాంతాలు.. 120 హోటల్స్: 1975లో ప్రారంభమైన ఐటీసీ హోటల్స్ విభాగం చేతిలో 70 ప్రాంతాల్లో 120 హోటళ్లున్నాయి. 11,600 గదులున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో రూమ్ ఇన్వెంటరీ, ఆదాయం, లాభాలు అన్నింటిలోనూ అద్భుతమైన వృద్దిని నమోదు చేసింది. లగ్జరీ విభాగంలో ‘ఐటీసీ హోటల్స్’, ప్రీమియం విభాగంలో ‘వెల్‌కం హోటల్’, మిడ్ మార్కెట్ విభాగంలో ‘ఫార్చూన్’; లీగల్, హెరిటేజ్ విభాగంలో ‘వెల్‌కం హెరిటేజ్’ బ్రాండ్లున్నాయి.
Updated Date - 2023-07-25T03:22:11+05:30 IST