Canara Bank : అదరగొట్టిన కెనరా బ్యాంక్
ABN, First Publish Date - 2023-07-25T03:26:10+05:30
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గటంతో పాటు వడ్డీ ఆదాయం గణనీయంగా పెరగటంతో జూన్ త్రైమాసికంలో నికర లాభం 75 శాతం వృద్ధి చెంది రూ.3,535 కోట్లుగా నమోదైందని కెనరా బ్యాంక్
క్యూ1 లాభంలో 75% వృద్ధి జూ రూ.3,535 కోట్లుగా నమోదు
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గటంతో పాటు వడ్డీ ఆదాయం గణనీయంగా పెరగటంతో జూన్ త్రైమాసికంలో నికర లాభం 75 శాతం వృద్ధి చెంది రూ.3,535 కోట్లుగా నమోదైందని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు వెల్లడించారు. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ.2,022 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.23,352 కోట్ల నుంచి రూ.29,828 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.18,177 కోట్ల నుంచి ఏకంగా రూ.25,004 కోట్లకు పెరిగిందని బ్యాంక్ వెల్లడించింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) కూడా 2.78 శాతం నుంచి 3.05 శాతానికి పెరిగింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఐఎం 3 శాతానికి ఎగువన ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సత్యనారాయణ రాజు అన్నారు.
తగ్గిన ఎన్‌పీఏలు
మరోవైపు స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) కూడా 6.98 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గగా నికర ఎన్‌పీఏలు 2.48 శాతం నుంచి 1.57 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. త్రైమాసిక సమీక్షా కాలం లో మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు రూ.2,418 కోట్లుగా ఉన్నాయి. జూన్ త్రైమాసికం ముగిసే నాటికి బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) 16.24 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి రేటు 10.5 శాతం, డిపాజిట్లు 8.5 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ సత్యనారాయణ రాజు తెలిపారు. కాగా వ్యాపార వృద్ధి కోసం టియర్-1, టియర్-2 బాండ్ల జారీ ద్వారా రూ.7,500 కోట్లు సమీకరించాలని చూస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరులో గిఫ్ట్-ఐఎ్‌ఫఎ్‌ససీలో ఆఫ్‌షోర్ బ్యాంకింగ్ విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు రాజు తెలిపారు.
Updated Date - 2023-07-25T03:26:10+05:30 IST