Infosys: బతిమాలుతున్నా మొండికేస్తున్న ఉద్యోగులు.. షాకిచ్చేందుకు సిద్ధమైన ఇన్ఫోసిస్!
ABN, First Publish Date - 2023-12-12T16:03:45+05:30
ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేసే దిశగా ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడి గడపదాటమంటున్న టెకీలను ఆఫీసులకు రప్పించేందుకు సంస్థలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే పనిలో ఉన్న ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులు ఆఫీసులకు రావాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ దిశగా చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం రూల్స్ మరింత కఠినతరం చేసేందుకు ఇన్ఫోసిన్ సిద్ధమైంది. ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలంటూ త్వరలో ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం.
ఇప్పటికే సంస్థలోని ఉన్నతాధికారులు ఉద్యోగులకు ఈ మేరకు ఈమెయిల్స్ పంపినట్టు తెలుస్తోంది. ‘‘వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావడం ప్రారంభించండి. త్వరలో ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నాం’’ అని మెయిల్ పంపించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై గతంలో చేసిన అభ్యర్థలనకు ఉద్యోగుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంపై కూడా సంస్థ యాజమాన్యం లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవిడ్ కారణంగా గతంలో ఇచ్చిన వర్క్ ఫ్రం హోం వెలుసుబాటు చాలా కాలం పాటే సాగిందని కంపెనీ అభిప్రాయపడింది.
Australia Visa : భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా.. భారతీయులకు ఇక గడ్డుకాలమే..
అయితే, ఈ అంశంపై ఇన్ఫోసిస్ ఇప్పటివవరకూ ఎటువంటి అధికారి ప్రకటన విడుదల చేయలేదు. కొన్ని డెలివరీ యూనిట్లు నిర్మానుష్యంగా ఉండటంపై సంస్థ ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆఫ్‌షోర్ డెవలప్మెంట్ సెంటర్లలోని ఉద్యోగులు తక్షణం కార్యాలయానికి రావాలని కూడా ఆదేశించింది. అయితే, మెడికల్ కారణాలతో వర్క్ ఫ్రం హోం అభ్యర్థలను మాత్రం పరిశీలిస్తామని సంస్థ పేర్కొనట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
Google: చంద్రయాన్-3 మరో రికార్డు..!
వర్క్ ఫ్రం హోం ఉద్యోగులపై ఇప్పటికే విప్రో కన్నెర్ర చేసింది. ఉద్యోగులు మొండిపట్టు వీడకుంటే పర్యవసానాలు తప్పవని ఘాటు హెచ్చరికలు చేసింది. విప్రో ప్రస్తుతం హైబ్రీడ్ వర్క్ పాలసీకి మారిన విషయం తెలిసిందే. దీని ప్రకారం, ఉద్యోగులు వారానికి మూడు రోజుల పాటు కచ్చితంగా ఆఫీసుల్లోనే పనిచేయాలి. ఆఫీసుకు రామనే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, ఇతర సౌకర్యాలు నిలిపివేసే అవకాశం ఉందని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. టీసీఎస్ కూడా తమ కార్యాలయాలను మునుపటి సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
Updated Date - 2023-12-12T16:08:43+05:30 IST