Toyota Innova Crysta: ఇన్నోవా క్రిస్టా టాప్‌ గ్రేడ్స్‌ ధరలను ప్రకటించిన టయోటా కిర్లోస్కర్‌

ABN, First Publish Date - 2023-05-02T20:14:57+05:30

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (TKM) తమ నూతన ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) రెండు గ్రేడ్ల (ZX,

Toyota Innova Crysta: ఇన్నోవా క్రిస్టా టాప్‌ గ్రేడ్స్‌ ధరలను ప్రకటించిన టయోటా కిర్లోస్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (TKM) తమ నూతన ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) రెండు గ్రేడ్ల (ZX, VX) ధరలను ప్రకటించింది. ఈ వాహనం మెరుగైన ఫ్రంట్‌ ఫేసిమా కలిగి ఉంది. దీనిని కఠినమైన, దృఢమైన ప్రదర్శన కోసం నిర్దిష్టమైన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇది భారతీయ కుటుంబాలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ అవసరాలు తీరుస్తుంది.

ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ సేల్స్‌, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ సూద్‌ మాట్లాడుతూ.. నూతన ఇన్నోవా క్రిస్టల్‌ డీజిల్‌ టాప్‌ టూ గ్రేడ్‌ ధరలను వెల్లడించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ వాహనాన్ని వినియోగదారులు అన్ని నూతన వేరియంట్లలోనూ ఆదరిస్తున్నట్టు చెప్పారు. కఠినమైన, దృఢమైన ముందు భాగం, శైలి, సౌకర్యం, పనితీరుతో కూడిన నూతన ఇన్నోవా క్రిస్టా.. ఇన్నోవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ వాహనంలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ప్రయాణికులకు అత్యున్నత భద్రతను అందిస్తాయని పేర్కొన్నారు.

ఈ నూతన ఇన్నోవా క్రిస్టాను రూ. 50 వేలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు డీలర్‌ ఔట్‌లెట్లతో పాటు www.toyotabharat.com వద్ద ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఇది నాలుగు గ్రేడ్లు G, GX, VX, ZX తోపాటు ఐదు రంగులు.. సూపర్‌ వైట్‌, ఆటిట్యూడ్‌ బ్లాక్‌ మికా, అవంత్‌ గ్రేడ్‌ బ్రాంజ్‌ మెటాలిక్‌, ప్లాటినమ్‌ వైట్‌ పెరల్, సిల్వర్‌ మెటాలిక్‌లో అందుబాటులో ఉంది.

గ్రేడ్ల వారీగా ఎక్స్ షోరూం ధరలు ఇలా..

* ZX (7 S) - రూ. 25,43,000

* VX (8 S) - రూ. 23,84,000

* VX (7 S) - రూ. 23,79,000

* VX FLT (8 S) - రూ. 23,84,000

* VX FLT (7 S) - రూ. 23,79,000

Updated Date - 2023-05-02T20:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising