Vodafone Idea: కస్టమర్లను నిలుపుకునేందుకు వొడాఫోన్ ఉచితంగా ఏం చేస్తోందంటే?
ABN, First Publish Date - 2023-01-19T21:38:50+05:30
వచ్చీ రావడంతోనే టెలికం రంగాన్ని షేక్ చేసిన జియో (Jio) ఆ తర్వాత దేశంలో తిరుగులేని నెట్‌వర్క్‌గా ఎదిగింది. దాని దెబ్బను తట్టుకోలేని
న్యూఢిల్లీ: వచ్చీ రావడంతోనే టెలికం రంగాన్ని షేక్ చేసిన జియో (Jio) ఆ తర్వాత దేశంలో తిరుగులేని నెట్‌వర్క్‌గా ఎదిగింది. దాని దెబ్బను తట్టుకోలేని చిన్నాచితకా కంపెనీలన్నీ మరో దానిలో కలిసిపోవడమో, బిచాణా ఎత్తివేయడమో చేశాయి. ఎయిర్‌టెల్ (Airtel) ఒంటరిగా పోరాడుతుండగా, వొడాఫోన్-ఐడియా కలిసిపోయి వొడాఫోన్ ఐడియా (Vi)గా మారాయి. మార్కెట్లో విపరీతమైన పోటీ ఎదుర్కొంటున్న ‘వి’.. ఖాతాతారులను నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది.
ఈ నేపథ్యంలో కస్టమర్లు చేజారిపోకుండా వొడాఫోన్ ఐడియా మరో సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది. వినియోగదారులు తమ యాక్టివ్ ప్లాన్‌ను రీచార్జ్ చేయకున్నా సరే వారికి ఉచితంగా కొంత డేటాను ఇస్తోంది. కారణం సింపుల్. వారు మరో టెలికం మారకుండా ఉండడంలో భాగంగానే వొడాఫోన్ ఐడియా ఇలా ఉచితంగా డేటాను ఇస్తూ వారిని నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఖాతాదారులు రీచార్జ్ చేయకున్నా వారికి ఉచితంగా డేటా ఇవ్వడం సరైనది కాదని టెలికం రంగ నిపుణులు అంటున్నారు. బలవంతంగా వారిని అట్టేపెట్టుకోవడం వల్ల టెల్కోకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.
ఇనాక్టివ్ యూజర్లకు ఉచితంగా డేటా ఇవ్వడం మాత్రమే కాదు, ఉచితంగా వాయిస్ కాల్స్ కూడా ఆఫర్ చేస్తోంది. కంపెనీని వారు వారు వదిలిపెట్టకుండా ఉంచే ఎత్తుగడలో భాగంగానే వొడాఫోన్ ఇలా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. వొడాఫోన్ ప్రయత్నాలతో ఖాతాదారులకు ప్రయోజనం చేకూరినా అంతిమంగా కంపెనీకి మాత్రం ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నది నిపుణల మాట.
కస్టమర్ రీచార్జ్ చేసుకోకున్నా ఆ ప్రయోజనాలు లభిస్తున్నప్పుడు అతడు ఎందుకు రీచార్జ్ చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, విషయం తెలిస్తే ఇతర యాక్టివ్ యూజర్లు కూడా రీచార్జ్ చేసుకోవడం మానేసే ప్రమాదం ఉందని అంటున్నారు. అప్పుడు ప్రాధాన్య నంబరుగా ఇతర నెట్‌వర్క్ సిమ్‌లను ఉంచుకుని, సెకండరీ సిమ్‌గా వొడాఫోన్ ఐడియాది ఉంచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఏరకంగా చూసినా వొడాఫోన్ ఐడియా చేస్తున్నది తప్పేనని అంటున్నారు. అయితే, ఈ విషయమై కంపెనీ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో స్పందించలేదు.
Updated Date - 2023-01-19T21:47:37+05:30 IST