సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు వాటా
ABN, First Publish Date - 2023-09-12T02:28:20+05:30
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల త్యాగం వెలకట్టలేనిది. స్వరాష్ట్ర పోరాటంలో కొందరు ప్రాణాలు విడిచి చరిత్రపుటల్లోకి ఎక్కారు...
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల త్యాగం వెలకట్టలేనిది. స్వరాష్ట్ర పోరాటంలో కొందరు ప్రాణాలు విడిచి చరిత్రపుటల్లోకి ఎక్కారు. ప్రాణాలతో మిగిలినవారు జీవచ్ఛవాలుగా బతుకు ఈడుస్తున్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో ఎందరో విద్యార్ధులు ప్రాణాలకు తెగించి పోరాడారు. కాని ముందు వరసలో ఉన్న నలుగురు అయిదుగురికి మాత్రమే ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దొరికింది. ఉద్యమకారులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉంది. 1969 నుండి ఇప్పటివరకు రాష్ట్రం కోసం పోరాడినవారికి అన్ని సంక్షేమ పథకాలలో యాభైశాతం రిజర్వేషన్ కల్పించాలి. దళితబంధు, బిసి బంధు, గృహలక్ష్మి ఇలా ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే ప్రతీ సంక్షేమపథకంలో సగం వాటా కల్పిస్తే అందరికీ న్యాయం చేకూరుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో యాభైశాతం రిజర్వేషన్ కల్పించి సైనికుల లాంటి ఉద్యమకారులను కాపాడుకోవాలి.
కందుల మధు (ఉస్మానియా యూనివర్సిటీ)
Updated Date - 2023-09-12T02:28:20+05:30 IST