ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏజెన్సీ డిఎస్సీ కావాలి!

ABN, First Publish Date - 2023-09-15T00:32:52+05:30

ఆదివాసీ సమాజంలో నిరుద్యోగం తాండవం చేస్తున్న సమయంలో, అనేక ఆదివాసీ సంఘాల పోరాటాల ఫలితంగా 2000 సంవత్సరంలో...

ఆదివాసీ సమాజంలో నిరుద్యోగం తాండవం చేస్తున్న సమయంలో, అనేక ఆదివాసీ సంఘాల పోరాటాల ఫలితంగా 2000 సంవత్సరంలో జనవరి 10న జీవో నెం.3 వెలువడింది. ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ ఉద్యోగాలను స్థానిక ఆదివాసీలకు 100శాతం ఇవ్వాలని జీవో నెం.3 స్పష్టం చేస్తుంది. నిజానికి ఈ జీవో ఎన్నడూ సంపూర్ణంగా అమలైన పాపాన పోలేదు. ఏజెన్సీలో గిరిజనేతరుల వలసల కారణంగా ఆ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దరిమిలా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ట్రిబ్యునల్ ఇచ్చిన మెమోలు, తీర్పుల తర్వాత కూడా ఏజెన్సీలో గిరిజనేతరులు ఉద్యోగాలు చేస్తూ ఆదివాసీ ఉద్యోగాలను దొడ్డిదారిన దోచుకొనిపోతూనే ఉన్నారు. చివరగా 2009 డిసెంబర్ 28న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు నెం.3ను సమర్థిస్తూ పదోన్నతులు కూడా ఏజెన్సీ వారికే వర్తిస్తాయని సంచలన తీర్పునిచ్చింది. 2011 వివరణాత్మక ఉత్తర్వులతో ఖమ్మం జిల్లా ఏజెన్సీ పాఠశాలలో 2012 జనవరి, జూలై నెలల్లో పదోన్నతులు అమలు జరిగాయి. కానీ వరంగల్ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు ఇచ్చిన వివరణాత్మక ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖధికారి అమలు చేయకపోవడం వల్ల పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న సుమారు 52మంది ఉపాధ్యాయులు 2012 ఆగస్టు నుంచి తమ సేవా కాలాన్ని నష్టపోతున్నారు. ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తున్న సందర్భంలో ఆదివాసీలకు ఏజెన్సీ డీఎస్సీని పెట్టాలని ఆదివాసీ సంఘాల మేధావులు కోరుతున్నారు. ఏజెన్సీ ఆదివాసులు ఇన్ని అడ్డంకులు ఎదుర్కొంటున్న స్థితిలో వారికి ప్రత్యేక డీఎస్సీలను ఐటీడీఏ ద్వారా నిర్వహించాలి. ఏజెన్సీ ఉత్తర్వు నెం.3కి చట్టబద్ధతను కల్పించాలి. బంగారు తెలంగాణ నిర్మాణంలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వం అత్యంత వెనుకబడిన ఆదివాసీలకు ఏజెన్సీ ఉత్తర్వు 3 ప్రకారం నూటికి నూరుశాతం ఉద్యోగాలు కల్పిస్తేనే ఆర్థిక ప్రగతితో కూడిన ‘గిరిప్రగతి’ లక్ష్యాన్ని చేరుకుంటారు.

వూకె రామకృష్ణదొర

Updated Date - 2023-09-15T00:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising