ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గాంధీజీ వారసత్వంపై దాడి

ABN, First Publish Date - 2023-09-01T03:16:26+05:30

గాంధేయ విలువల ప్రచారం కోసం వారణాసిలో నెలకొల్పబడిన అఖిల భారత సర్వ సేవా సంఘ్‌ భవనాలు ఇటీవల నేలమట్టం చేయబడ్డాయి....

గాంధేయ విలువల ప్రచారం కోసం వారణాసిలో నెలకొల్పబడిన అఖిల భారత సర్వ సేవా సంఘ్‌ భవనాలు ఇటీవల నేలమట్టం చేయబడ్డాయి. ఎంతో విలువైన వేలాది గాంధీజీ పుస్తకాలు నేలపాలు కాబడ్డాయి. గాంధీజీ మరోసారి హత్య చేయబడ్డాడు. ఇది భరతజాతే కాక యావత్‌ మానవాళి సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. మొత్తం ఆరు బుల్‌డోజర్లు ఈ పనికి పూనుకున్నాయి. ఈ సందర్భంగా పదిమంది గాంధేయవాదులను నిర్బంధంలోకి తీసుకున్నారు. జాతిపిత పట్ల ప్రభుత్వాలు చూపెట్టిన ఈ అమానుషత్వం, అగౌరవానికి జాతి మొత్తం తల్లడిల్లింది.

అఖిల భారత సర్వ సేవా సంఘ్‌కు ఘనమైన చరిత్ర, గొప్ప వారసత్వం ఉంది. స్వాతంత్య్రం సాధించిన తరువాత తను కలలు కన్న స్వరాజ్యాన్ని సాధించేందుకు దేశంలో ఉన్న నిర్మాణాత్మక కార్యకర్తలందరితో 1948 ఫిబ్రవరి 2వ తేదిన సమావేశమవ్వాలని గాంధీజీ భావించారు. దురదృష్టశావత్తు మూడు రోజుల ముందే 1948 జనవరి 30న ఆయన హత్యగావించబడ్డారు. కానీ ఈ సమావేశం 1948 మార్చి 11–15 తేదీల మధ్య యథావిధిగా జరిగింది. మొత్తం 47 మంది గాంధేయవాదులు, స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు. ఆచార్య వినోబాభావే, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజేంద్రప్రసాద్‌, మౌలానా అబుల్‌కలాంఆజాద్‌, జాకీర్‌ హుస్సేన్‌, గుల్జారీలాల్‌ నందా, సోషలిస్ట్‌ నాయకుడు జయప్రకాష్‌ నారాయణ వంటి ఉద్దండులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అఖిల భారత చరఖా సంఘ్‌, అఖిల భారత గ్రామ ఉద్యోగ సంఘ్‌, అఖిల భారత గో సేవా సంఘ్‌, హిందుస్తానీ తలిమి సంఘ్‌, మహ్‌రోగి సేవా మండల్‌ వంటి ఐదు నిర్మాణాత్మక సంస్థలను విలీనం చేసి 1948 ఏప్రిల్‌లో అఖిల భారత సర్వసేవా సంఘ్‌ను ఏర్పాటు చేశారు. గాంధీ సందేశాన్ని, సర్వోదయ సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఈ సంస్థ నెలకొల్పబడింది. అందుకనుగుణంగా దీనికి అనుబంధంగా 1955లో సర్వ సేవా సంఘ్‌ ప్రకాశన్‌ అనే ప్రచురణల విభాగం కూడ ప్రారంభించబడింది. ఈ ప్రాంగణంలోనే జయప్రకాష్‌ నారాయణ గాంధీజీ విద్యా సంస్థాన్‌ అనే విద్యాసంస్థను కూడ స్థాపించారు. దానికి అఖిల భారత సామాజిక శాస్త్రాల పరిశోధనా సంస్థ (ఐసిఎస్‌ఎస్‌ఆర్‌) వారు 1977 నుండి ఆర్థిక సహాయం కూడ అందించారు. ఈ ఏడాది మే 15న గాంధీ విద్యాసంస్థాన్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇందిరాగాంధీ జాతీయ లలితకళల కేంద్రానికి అప్పగించింది. దీనిపై సర్వసేవాసంఘ్‌ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ సత్యాగ్రహం చేపట్టారు.


1960 మేలో నాటి రైల్వే మంత్రి లాల్‌ బహుదూర్‌శాస్త్రి చొరవతో రైల్వేశాఖకు చెందిన 12.9 ఎకరాల స్థలాన్ని అఖిల భారత సర్వసేవా సంఘ్‌వారు కొనుగోలు చేశారు. ఎకరా రూ.2,700 చొప్పున నగదు మొత్తాన్ని సంఘ్‌వారు స్టేట్‌ బ్యాంక్‌ రైల్వేశాఖా ఖాతాలో జమ చేశారు. రిజిస్ట్రేషన్‌ కూడ జరిగింది. నిజానికి వారణాసిలోని ఈ భూమి ఈస్ట్‌ ఇండియా రైల్వే వారికి భారత ఆర్మీవారు ఒక ఒప్పందం ద్వారా బదిలీ చేశారు. సక్రమంగా కొనుగోలు చేసి, విక్రయ దస్తావేజులు కూడ కలిగి, దశాబ్దాల నుండి అందులో భవనాలు కట్టుకొని ఉంటున్న ఆ భూమి సర్వసేవాసంఘ్‌ వారిది కాకుండా ఎలా పోయిందో అంతుపట్టని విషయం. జూన్‌లో ఇచ్చిన తొలగింపు నోటీసుకు వ్యతిరేకంగా గాంధేయవాదులు 50 రోజులపాటు సత్యాగ్రహం చేశారు. సర్వసేవాసంఘ్‌ వారు రైల్వేశాఖతో చేసుకున్న ఒప్పందం సక్రమమైనది కాదని వారికి ఆ భూమిపై యాజమాన్య హక్కులు లేవని రైల్వేశాఖవారు వేసిన కేసులో సర్వసేవాసంఘ్‌ వారు సుప్రీంకోర్టు తలుపు తట్టినా, అంతిమ విజయం రైల్వేశాఖ వారిదే అయ్యింది. నోటీసులు ఇచ్చి ఆగస్టు 12న అఖిల భారత సర్వసేవాసంఘ్‌ వారి భవనాలను కార్యకర్తల నిరసనల మధ్య కూల్చివేశారు.

గాంధీజీ వారసత్వాన్ని నాశనం చేయడానికి గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం, వార్ధా గాంధీ గ్రామ్‌లో కూడ ఒక పథకం ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

డా. పి.సి. సాయిబాబు

Updated Date - 2023-09-01T03:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising