ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ద్రావిడ వాదమూ జాత్యహంకారమే!

ABN, First Publish Date - 2023-09-14T01:15:20+05:30

రాముడి పటానికి చెప్పులు దండ వేసి ఊరేగించి రాజకీయ సోపానాలు నిర్మించుకున్న రాజకీయ వేదికకు చెందిన వారసులు ఇప్పటికీ సనాతన ధర్మంపై...

రాముడి పటానికి చెప్పులు దండ వేసి ఊరేగించి రాజకీయ సోపానాలు నిర్మించుకున్న రాజకీయ వేదికకు చెందిన వారసులు ఇప్పటికీ సనాతన ధర్మంపై విషం చిమ్ముతుండడం హిందుత్వ వాదానికి చేయూతనివ్వడమే. హిందూ జాతీయ వాదం జాత్యాహంకారమైతే ద్రావిడ జాతీయవాదం కూడా అలాంటిదే. మనిషిని మనిషిగా చూడనివ్వకుండా భాష, ప్రాంతం, మతం, కులం పేరిట విభజించి చూసే ఏ సిద్ధాంతమైనా ఫాసిజమే, మతానికి మరో రూపమే. కులాన్ని వ్యతిరేకించినంత మాత్రాన ద్రావిడ సిద్ధాంతం గొప్పదైపోదు, ఆచరణలో అది భాషా విద్వేషానికి, వ్యక్తి పూజకి, రాజకీయ వంశ నిర్మాణానికి, అంతులేని అవినీతికి కారణమైనదన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించకపోలేదు.

సనాతన ధర్మంపై సీమ టపాకాయలు పేల్చే వాళ్ళు బ్రూనో బలిదానానికి కారణమైన మత మౌఢ్యాన్ని, పర్షియా మొదలుకుని జావా, సుమత్రా దీవుల వరకు సాగిన మత హింసను గుర్తించలేని, గుర్తించినా ఖండించలేని అసక్తులవడానికి కారణం రాజకీయ స్వార్థమే. భారతదేశంలో సనాతన ధర్మం వేర్లు పెకిలించడానికి వీలులేనంత లోతున ఉన్నాయి. భారతీయులు రామాయణ కల్పవృక్షాన్నీ ఆదరించారు, రామాయణ విషవృక్షాన్నీ సహించారు. సనాతన ధర్మంలో సహనశీలత అంతర్భాగం. దానికి చెదలు పట్టించిన ఘనత రాజ్యాధికారం కోసం, వర్గాధిపత్యం కోసం ప్రాకులాడిన, ప్రాకులాడుతున్న స్వార్థజీవులదే.


రాముడి పటానికి చెప్పులు వేసి వీరు రాజకీయ సోపానాలు నిర్మించుకుంటే, రాముడి పేరిట మారణ హోమాలు సృష్టించి మరికొందరు రాజ్యాధికారం చేపట్టారు. ఇరువురూ చేసే రాజకీయ యజ్ఞంలో అంతిమంగా సమిధలవుతున్నది మటుకు ప్రజలే. ఆ ప్రజలను మనుషులుగా కాక మతస్థులుగానో, కులస్తులుగానో, ప్రాంతీయులుగానో, భాషీయులుగానో చూసే రోగం పట్టిన ఇలాంటి రాజకీయ పార్టీలని వేర్లతో సహా పెకిలించి వేసినపుడే భారతదేశానికి నవోదయం.

గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2023-09-14T01:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising