ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలో భవితలేని యువత

ABN, First Publish Date - 2023-09-28T01:01:17+05:30

సమర్థ శిక్షణతో యువతలో నైపుణ్యం పెంచి సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా రాష్ట్ర ఉత్పాదకతను గణనీయంగా పెంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో 7 మిషన్‌లలో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌...

సమర్థ శిక్షణతో యువతలో నైపుణ్యం పెంచి సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా రాష్ట్ర ఉత్పాదకతను గణనీయంగా పెంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో 7 మిషన్‌లలో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యువతకు శిక్షణ ఇచ్చి సుశిక్షుతులైన సైనికులుగా మార్చి వారు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని ఆలోచించి స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు, వారి భవిష్యత్తుకు మెరుగైన బాటలు వేశారు చంద్రబాబు. కానీ, జగన్‌రెడ్డి యువత జీవితాలు ఏమైపోయినా ఫర్వాలేదు తనకు మాత్రం కక్ష సాధింపు, ప్రతీకారం సాధించడమే ధ్యేయంలా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసి స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నారు. యువతకు ఈ రకమైన శిక్షణ కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సంస్థలు, విశ్వవిద్యాలయాలు పెద్ద ఎత్తున సీమెన్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వారు కూడా అవినీతికి పాల్పడినట్టేనా?

మార్చి 22, 2016న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్ పరిశీలిస్తే శిక్షణా కేంద్రాల్లో ఎలాంటి పరికరాలు, ఎటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉందో సీఐడీ వారికి కనిపిస్తుంది. సీమెన్స్ సంస్థ అందించిన సాఫ్ట్‌వేర్ వాల్యుయేషన్ వివరాలకు సంబంధించిన వాల్యుయేషన్ అంతా బోగస్ అన్నట్టు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. యువతకు పనికొచ్చే ప్రాజెక్టుల వాల్యుయేషన్ వైసీపీ నాయకులకు, జగన్‌రెడ్డికి ఏం తెలుస్తాయి. అవినీతి దోపిడీ వాల్యుయేషన్లు అయితే వారికి తెలుస్తుంది. అమెరికాలో ప్రముఖ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సుబ్బారావుని, రాష్ట్రానికి తీసుకొచ్చి ఐటీ పరిజ్ఞానం ఉమ్మడి ఏపీ యువతకు అందించాలని చంద్రబాబు కోరారు. అదే సుబ్బారావుని ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర్ రెడ్డి కూడా కొనసాగించారు. ఉమ్మడి రాష్ట్ర ఐటీ విభాగం సీఐవో, ఈవోగా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గవర్నెన్స్ ప్రెసిడెంట్‌గా, చీఫ్ మినిస్టర్ ప్రత్యేక కార్యదర్శిగా సుబ్బారావుకి మూడు పదవులు ఇచ్చి మరీ రాజశేఖర్ రెడ్డి తన ప్రభుత్వంలో కొనసాగేలా చేశారు. అలాంటి వ్యక్తి జగన్‌రెడ్డి ప్రభుత్వానికి తప్పుడు మనిషిగా కనిపిస్తున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో 2,77,000 మంది ట్రైనింగ్‌కు దరఖాస్తు చేసుకోగా 2 లక్షల 13 వేల మందికి శిక్షణ ఇచ్చారు. 75 వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. నెలకొల్పిన సెంటర్లు, అందులో ఎక్విప్‌మెంట్లు, శిక్షణా తరగతులు, గత ఆరేళ్లుగా ఫలితాలు ఇస్తున్నాయి. దీనిని కుంభకోణమని ఎలా అంటారు. చంద్రబాబు పాలనా చర్యల వల్ల స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలతో ఐటీ రంగంలోనే కాదు ఆటోమొబైల్, ఏరోస్పేస్, ఔషధ రంగాల్లో కూడా యువకులు నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఇంటర్, పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు కూడా తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేశారు. 2016లో రాష్ట్రవ్యాప్తంగా 43 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ప్రారంభించారు. 2019లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆ అవార్డు కూడా తీసుకున్నారు.


టీడీపీ పాలనలో పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాక రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాకపోగా ‎కమీషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్‌ను నాశనం చేసింది.

వైసీపీ ప్రభుత్వమే అభినందన పత్రాలు ఇస్తుంది... ఈ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 40 కాలేజీల వారు తమ క్యాంపస్‌లలో సీమెన్స్ నైపుణ్య శిక్షణా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని లేఖలు ఇచ్చారు. అన్నిరకాల పరికరాలు అందినట్టు స్టాక్ రిజిస్టర్లలో సంతకాలు పెట్టి ఇచ్చారు. ఇదంతా పక్కనపెట్టి, అవినీతి జరిగిందని జగన్ సర్కార్ దుష్ప్రచారం చేస్తోంది. విద్యార్థి, యువతకు చంద్రబాబు అన్ని విధాలా అండగా నిలిస్తే.. జగన్‌రెడ్డి మాత్రం తన అవినీతి, అరాచక పాలనతో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి యువత భవిష్యత్‌ని ప్రశ్నార్థకం చేశారు.

ప్రణవ్ గోపాల్

టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు

Updated Date - 2023-09-28T01:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising