ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జ్ఞానజ్యోతి గురువు

ABN, First Publish Date - 2023-09-05T02:47:42+05:30

ఏ స్థాయిలో ఉన్న వారైనా, చిన్నప్పుడు చదువు చెప్పిన గురువును, తాము గొప్ప స్థితిలో ఉండడానికి కారణమైన ఉపాధ్యాయులను తప్పకుండా గుర్తుచేసుకుంటారు. ఏ రంగంలో రాణించిన...

ఏ స్థాయిలో ఉన్న వారైనా, చిన్నప్పుడు చదువు చెప్పిన గురువును, తాము గొప్ప స్థితిలో ఉండడానికి కారణమైన ఉపాధ్యాయులను తప్పకుండా గుర్తుచేసుకుంటారు. ఏ రంగంలో రాణించిన వారైనా గురువు వద్ద పాఠాలు నేర్చుకున్నవారే, గురువు అందించిన విజ్ఞానంతో, ప్రోత్సాహంతో, స్ఫూర్తితో ఎదిగినవారే. విద్యార్థులను సంస్కారవంతులుగా, జ్ఞానులుగా, బాధ్యతగల భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో కీలకపాత్ర పోషించేది గురువే. గురువులకు తనపర భేదాభిప్రాయాలు ఉండవు. ఒక గొప్పతరం తయారు కావాలంటే అది కేవలం గొప్ప గురువు వల్లే సాధ్యం.

సర్వేపల్లి రాధాకృష్ణన్ మానవతావాది, తత్వవేత్త, గొప్ప పండితుడు. రాజకీయ రంగంలోకి ప్రవేశించక మునుపు ఎన్నో యూనివర్సిటీలలో తత్వశాస్త్ర పాఠాలు బోధించేవారు. ఆయన బోధనకు విద్యార్థులు మంత్రముగ్ధులయ్యేవారు. 1952లో ఆయన ఉపరాష్ట్రపతి కాగానే, శిష్యులందరూ ఆ ఏడాది ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5ను గొప్పగా జరపాలని నిర్ణయించుకుని రాధాకృష్ణ అనుమతి కోరారు. తన జన్మదినాన్ని ఇలా ప్రత్యేకంగా జరిపే బదులు దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తే అది తనకు ఎంతో తృప్తినిస్తుందని అన్నారాయన. రాధాకృష్ణన్ ఎన్నో విజయాలు సాధించినా జీవితచరమాంకం వరకూ ఉపాధ్యాయుడి పాత్రనే నిర్వహించారు. ఉపాధ్యాయుడు అంటే నిత్య విద్యార్థి, అలా ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు విద్యార్థులకు పూర్తిన్యాయం చేయగలుగుతారని ఆయన విశ్వసించేవారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఉపాధ్యాయుడే.

కొవ్వొత్తి తాను కరిగి, చుట్టూ ఉన్న అంధకారాన్ని తరిమికొడుతుంది. ఉపాధ్యాయుడు కూడా తన శిష్యుల్లో అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగింపచేస్తాడు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక పాఠాన్ని బోధించాలంటే ఆ అంశం మీద ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి పరమ పవిత్రమైనది. విద్యాదానం ఉన్నతమైనది. తనకంటే ఎదిగిన వారిని చూస్తే అసూయ కలగడం మానవ నైజం కానీ, ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం శిష్యులు ఎంత ఎదిగితే ఉపాధ్యాయుడు అంత సంతోషపడతాడు. సమాజంలో పేరు కీర్తి ప్రతిష్టలు గల శిష్యులను పొందితే గురువు జీవితం సార్థకమైనట్లే. విద్య అంటే కేవలం పాఠాలు బోధించడం కాదు. నైతిక విలువలు, మానవత్వం, మనుగడకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలు అందులో భాగం. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా గురువు స్థానాన్ని ఏదీ ఆక్రమించలేదు.

స్వప్న కొండ

ప్రిన్సిపాల్‌, రాజపేట (ఆలేరు)

Updated Date - 2023-09-05T02:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising