ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దొరలరాజ్యం పోయి దొరసానుల రాజ్యం

ABN, First Publish Date - 2023-09-23T00:22:30+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆహ్వానించదగిందే అయినా..... ఏ మహిళలకోసం అనేది ప్రశ్న!...

కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆహ్వానించదగిందే అయినా..... ఏ మహిళలకోసం అనేది ప్రశ్న!

భారతదేశంలో దాదాపు 50 శాతానికి పైబడిన మహిళల జనాభాశాతమే ఈ బిల్లుకు ప్రాతిపదిక అయినప్పుడు, అదే దేశ సమాజం కులాలవారీగా విడగొట్టబడి నిర్మింపబడ్డప్పుడు, ఈ మహిళా బిల్లులో కులాన్ని చేర్చకపోవడం, మరీ ముఖ్యంగా బీసీ, ఓబీసీ, ముస్లిం కులాలకు చారిత్రకనష్టం కలుగుతుంది.

కారణాలు ఏమైనా, స్వాతంత్ర్య పోరాటంలో డా. బీఆర్‌ అంబేడ్కర్ రిజర్వేషన్, కమ్యూనల్ అవార్డు, సెపరేట్‌ సెటిల్‌మెంట్‌ పోరాటాల్లో బీసీలు కలిసిరాలేదు. అది ఒక నామూషీగా భావించారనేది చారిత్రక సత్యం. దాని ఫలితంగానే మండల్ కమిషన్ వచ్చేవరకు ఓబీసీలు విద్యా, ఉద్యోగాల్లో తమ ప్రాతినిధ్యం కోల్పోయారు, ఇప్పటికీ రాజకీయ రిజర్వేషన్లు పొందలేకపోయారు.

ఎస్సీ–ఎస్టీ రిజర్వేషన్‌లో వర్గీకరణ కావాలని, తమ అన్నికులాలకు మరీముఖ్యంగా అవకాశాలు పొందని కులాలకు న్యాయం జరగాలని ఒక సామాజిక న్యాయపోరాటం జరుగుతున్న ఈ కాలంలో, బీసీ, ఓబీసీ, ముస్లిం సోదరులు తమ జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాటం చేయకుంటే అగ్రవర్ణాల ఉచ్చులో పడినట్టే.

‘ముందు బిల్లు రానివ్వు, తర్వాత వాటాల కోసం కొట్లాడుదాం’ అనేది అగ్రకులాల, దొరసానుల ధోరణి. స్వాతంత్ర్యపోరాటంలో ఈ వైఖరే అణగారిన వర్గాల కొంప ముంచింది. బీసీ, ఓబీసీ, ముస్లిం, మైనారిటీలు ఇప్పటికైనా కళ్లుతెరిచి గోడమీద పిల్లులుగా కాకుండా సామాజిక న్యాయం కోసం ఎస్సీ–ఎస్టీలతో కలిసి పోరాడండి. తమ స్వార్థం కోసం దొరల, దొరసానుల దగ్గర ఊడిగం చేస్తూ తమ జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టేవారిని వెలివేయండి.

మనుషులంతా ఒక్కటే అనే అగ్రవర్ణ నినాదంలో, మనం, మన జాతి, మన కుటుంబం ఎక్కడ ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోండి.

నూటికి 90 శాతం ఉన్న అణగారిన, ఉత్పత్తి, సేవా కులాలు పట్టుమని 10 శాతం లేని ఈ దొరల చెప్పుచేతల్లో ఎందుకు ఉన్నామో, అన్ని తెలిసి గోడమీది పిల్లుల్లాగా ఎందుకు వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోండి.

దొరల పాలన పోయి దొరసానుల పాలన రావడానికీ, సామాజిక తెలంగాణ కోసం కొట్లాడితే దొరల తెలంగాణ రావడానికి తేడా లేదు. దొరసానులు చట్టసభల్లో రాజకీయాధిపత్యం, వారి దొరలు జనాల్లో పెత్తనం–డబుల్‌ ధమాకాగా ఉంది ఈ దొరసానుల రిజర్వేషన్ బిల్లు. దీని స్థానంలో ‘సామాజిక మహిళా రిజర్వేషన్ బిల్లు’ కోసం వెనుకబడిన, అణగారిన, మైనారిటీ ప్రజలు పోరాడాలి.

డా. బాబురావు

ప్రొఫెసర్, సామాజిక వైద్యవిద్య విభాగం,

గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, సూర్యాపేట

Updated Date - 2023-09-23T00:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising