ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నష్టపోయింది అమాయక జనాలే!

ABN, First Publish Date - 2023-10-06T02:07:44+05:30

‘పోయినోళ్లంతా మంచోళ్లే’ అని మనసు కవి, ‘మరణాంతాని వైరాణి’ అని వాల్మీకి అన్నారు. మరణించిన వారి గురించి చెడు మాట్లాడకూడదనేది మన సమాజం అనాదిగా పాటిస్తున్న నీతి...

‘పోయినోళ్లంతా మంచోళ్లే’ అని మనసు కవి, ‘మరణాంతాని వైరాణి’ అని వాల్మీకి అన్నారు. మరణించిన వారి గురించి చెడు మాట్లాడకూడదనేది మన సమాజం అనాదిగా పాటిస్తున్న నీతి. గద్దర్‌ చనిపోయిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పెద్దయెత్తున జరిగిన స్మారక సభల్లో దళిత, బహుజన సంఘాలతో పాటు సమస్త ఎర్రజెండా పార్టీలు ఘనంగా నివాళులు అర్పించాయి. మంచిది, దానికి గద్దర్‌ అర్హుడే కాదనలేం. సెప్టెంబర్‌ 13న ఆంధ్రజ్యోతిలో కృపాకర్‌ మాదిగ కలమెత్తిన దాకా ఎవరూ చిన్న భిన్నాభిప్రాయం వ్యక్తపరచలేకపోయారు. చనిపోయిన వాళ్లకు వ్యతిరేకంగా చెడు వ్యాఖ్యలు చేయకూడదనే ఆచారాన్ని సామాన్యులు పాటిస్తే అర్థం చేసుకోగలం. కానీ ఎర్రజెండా పార్టీలన్నీ ఊదరగొడ్తూ ‘ప్రజాయుద్ధనౌక’ని చేతుల్తో నెట్టే ప్రయత్నమే చేశాయి. ఒకానొక నక్సల్‌ గ్రూపు జాతీయ కార్యదర్శి తమ అధికార పత్రికలో ‘‘సామాన్య ప్రజల విశ్వాసాలతో జత కలసి నడిచాడు. భావవాద, మతవాద విశ్వాసాలతో ఉన్న ప్రజలను వాటి ద్వారా కూడా బయటకు లాగాలనుకున్నాడేమో... అందుచేతనే బతుకమ్మ, సీతమ్మల చుట్టూ తిరిగాడు’’ అని ప్రకటించాడు. ఈ మధ్య ఎందుకో నక్సల్స్‌ గ్రూపుల నాయకులందరి హృదయ వైశాల్యం బాగా పెరిగింది. కత్తులు దూసి నెత్తురు పారించిన వాళ్లు కపటంగా అలాయ్‌ బలాయ్‌ ఆడుతున్నారు.

మిగిలిన ఎర్ర పార్టీలందరి కంటే అతణ్ణి ఆకాశానికెత్తినవాళ్లు, అతను ఆకాశానికెత్తిన వాళ్లు మావోయిస్టులు. ప్రజాసంఘాల నాయకుని పాత్ర నుంచి చర్చల నాటి రోజుల్లో మావోయిస్టులతో మమేకమైనవాడు గద్దర్‌. కృపాకర్‌ చెప్పినట్టు ఒకనాటి తమ వాడి గురించి అతనితోనూ, అతని చర్యలతోనూ మాకు సంబంధం లేదని ప్రకటించి ప్రజల దృష్టికి తీసుకురాకపోవటం మావోయిస్టుల బాధ్యతారాహిత్యం. ఇందులో గద్దర్‌ని తప్పుపట్టాల్సిన పని లేదు. ప్రజా ఉద్యమాల కారణంగా పెరిగిన తన ప్రతిష్ఠని పెట్టుబడిగా పెట్టి మరోరకంగా పెరగాలనే తపన అతనిలో ఉంది కనుక ఆ పని చేయలేడు. మావోయిస్టుల ఆచరణ గురించి తెలిసిన వాళ్లెవరూ వారి బాధ్యతారాహిత్యాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించరు. ఎందుకంటే అది వారు వారి జన్మహక్కుగా భావిస్తారు.

గత సంవత్సరం ఏప్రిల్‌ 18న గద్దర్‌ తప్పుల్ని ఎత్తిచూపుతూ ఆంధ్రజ్యోతిలో రాసినప్పుడు అందరికంటే ఎక్కువ బాధపడినవారు మావోయిస్టు సానుభూతిపరులే. మొన్న గద్దర్‌ చనిపోయినప్పుడు కూడా గద్దర్‌ని ఆపరేషన్‌ పేరుతో హత్య చేశారని ఛానల్స్‌కి వాయిస్‌ ఇచ్చివాళ్లు చివరి రోజుల్లో గద్దర్‌ పక్కనున్న మాజీ మావోయిస్టులే. అతని ఆట, పాట, మాట విని విప్లవోద్యమం పట్ల ఆకర్షితులై, అందులో పనిచేసి చదువులు, ఉద్యోగాలు, ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన వారికి వారి కుటుంబాలకు గద్దర్‌ నిజాయితీగా క్షమాపణలు చెప్పివుంటే బాగుండేదని కృపాకర్‌ బాధపడ్డాడు. గుళ్లు, గోపురాలు తిరుగుతూ, రామానుజ కీర్తనలు పాడుతూ తిరుగుతున్న గద్దర్‌ ప్రవర్తనను ఎత్తిచూపి తనని డిజోన్‌ చేసుకోకుండా ఇంకా ప్రజల్లో అతణ్ణి పైకెత్తి నిలిపే ప్రయత్నం చేస్తున్న నక్సల్స్‌ గ్రూపుల ప్రవర్తన నిరసనకు అర్హం. మత విశ్వాసాల్ని కూడా విప్లవోద్యమానికి ఉపయోగపెడతాడనే భ్రమలు కల్పించేవారు ముందు కేసీఆర్‌ని, ఆ తర్వాత రాహుల్‌గాంధీని, చివరకు ప్రజాశాంతి పార్టీ కెఎ పాల్‌ని కలిసి ఆలింగనాలు చేసుకోవటం కూడా విప్లవోద్యమంలోకి వారిని ఆకర్షించే ప్రయత్నంగా చెబుతారేమోనని భయంగా ఉంది. గద్దర్‌–మావోయిస్టులు ఒకర్ని పెంచటంలో మరొకరు పోటీపడ్డారు. కాని వారి కీర్తిప్రతిష్ఠలు పెరగటానికి కారకులై రకరకాలుగా నష్టపోయిన ప్రజల పట్ల బాధ్యతని ఇరువురూ విస్మరించారు.

చెరుకూరి సత్యనారాయణ

Updated Date - 2023-10-06T02:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising