ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పిహెచ్‌.డి ప్రవేశాలలో అవకతవకలు

ABN, First Publish Date - 2023-09-20T01:26:25+05:30

ఇటీవల కాకతీయ యూనివర్సిటీలో కేటగిరీ–2 కింద పిహెచ్‌.డి ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వ హించి సీట్లను కేటాయించారు. ఈ సీట్ల కేటాయింపులో...

ఇటీవల కాకతీయ యూనివర్సిటీలో కేటగిరీ–2 కింద పిహెచ్‌.డి ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వ హించి సీట్లను కేటాయించారు. ఈ సీట్ల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈ ప్రవేశాల ఇంటర్వ్యూలను వీడియో రికార్డు ద్వారా చిత్రీకరించి చాలా పారదర్శకంగాను, సామాజిక కూర్పుతోను చేశామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కానీ విడుదలైన జాబితాను బట్టి చూస్తే అది నిజం కాదనిపిస్తున్నది. పలు విభాగాలలో పీహెచ్డీ ప్రవేశాలు పొందిన వారిని చూస్తే ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్‌ ఉన్నవారిని తీసుకువచ్చి వారికి కావాల్సిన వాళ్లకు సీట్లను కేటాయించారనిపిస్తున్నది. కొన్ని విభాగాలలో అధిక మొత్తంలో ఉన్న సీట్లను ఇతర కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకే కేటాయించి రెగ్యులర్ విద్యార్థులకు తక్కువ సీట్లను కేటాయించారు. ఈ ఫలితాల జాబితాను వెబ్‍సైటులో పొందుపరచకుండా, వర్సిటీ అధికారులు విద్యార్థులు అనవసరంగా దీక్షలు చేస్తున్నారని బయట సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ చొరవ తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజన విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

ఇట్టెబోయిన తిరుపతి యాదవ్,

చైర్మన్, కాకతీయ యూనివర్సిటీ జాక్

Updated Date - 2023-09-20T01:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising