కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నా ప్రియమైన పాలస్తీనా స్వేచ్ఛా పతాక

ABN, First Publish Date - 2023-10-18T03:44:54+05:30

వీరుల నినాదాలతో వీధులు మార్మోగాలి జాత్యాహంకార శిరసుల చెవులనవి తాకాలి పాలస్తీనాను భస్మం చేస్తానన్నవాళ్లు...

నా ప్రియమైన పాలస్తీనా స్వేచ్ఛా పతాక

వీరుల నినాదాలతో వీధులు మార్మోగాలి

జాత్యాహంకార శిరసుల చెవులనవి తాకాలి

పాలస్తీనాను భస్మం చేస్తానన్నవాళ్లు వణికే క్షణం రానే వచ్చింది

దశాబ్దాల తరబడి దశలు దిశలుగా యుద్ధం నెమ్మదిగా సాగింది

ఇప్పుడిక వేగమే మీ దేవత, యుద్ధభేరి మీ నాయకుడు

ఆశయాలే మీ ఆయుధాలు ఆచరణలే మీ శిరస్త్రాణాలు

మీ బలమైన చేతుల్లోనే

మీ విజయం పదిలంగా ఉంది

టెల్అవీవ్‌ ప్రభువులు, మొస్సాద్ మొసళ్ళు,

అమెరికా ప్రభువులకిక తావే లేదు

శత్రువు మిమ్మల్నిక లొంగదీయలేడు

మీ శక్తి నతడు ఎదుర్కోలేడు

ఐక్యంగా ఒకే బాటలో నడవండి

మొక్కవోని ధైర్యంతో అభిజాత్యాన్ని అంత మొందించండి నా ప్రియమైన పాలస్తీనాలో స్వేచ్ఛా పతాకను ఎగరవేయండి.

బి.విల్సన్, గుంటురు

Updated Date - 2023-10-18T03:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising