ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భారత–చైనా మిత్రమండలి జాతీయ మహాసభలు

ABN, First Publish Date - 2023-10-13T01:03:11+05:30

భారత, చైనా దేశాల మధ్య అన్ని రంగాలలో సంపూర్ణమైన మైత్రీ సంబంధాలు నెలకొనాలనే సదాశయంతో 1950ల నుంచి దేశవ్యాప్తంగా కృషిచేస్తున్న దేశభక్తుల విశాలవేదిక, స్వచ్ఛంద ప్రజాసంస్థ భారత–చైనా మిత్రమండలి...

భారత, చైనా దేశాల మధ్య అన్ని రంగాలలో సంపూర్ణమైన మైత్రీ సంబంధాలు నెలకొనాలనే సదాశయంతో 1950ల నుంచి దేశవ్యాప్తంగా కృషిచేస్తున్న దేశభక్తుల విశాలవేదిక, స్వచ్ఛంద ప్రజాసంస్థ భారత–చైనా మిత్రమండలి. వేలాది సంవత్సరాలుగా చక్కటి సంబంధాలు కలిగివున్న రెండు అతి పెద్ద పౌరుగుదేశాలు ఇవి. బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతీయోద్యమ వెల్లువల కాలంలో సహకరించుకున్న దేశాలు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, డాక్టర్‌ శాంతారాం, కోట్నిస్‌ వంటి మహనీయ వ్యక్తులు కాంక్షించిన అంతర్జాతీయ మానవతకు, మానవీయ సంస్కృతికి రూపదిద్దిన మిత్రదేశాలు. జనాభారీత్యా కూడా నేటి ప్రపంచంలో మొదటి రెండు స్థానాలలో వున్న దేశాలు. అందువల్ల ఈ రెండు దేశాల మధ్య స్నేహం మానవాళిలో అత్యధిక జనాభా మధ్య వెల్లివిరిసే సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఉంటుంది. ఈ స్నేహం రెండు దేశాల మధ్య శాంతికి, ఆసియా ఖండంలో శాంతికి, తద్వారా ప్రపంచశాంతికి బాటలు వేస్తుంది.

భారత్‌, చైనాలు రెండూ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంలో భాగమే. బ్రిక్స్‌లో రెండూ సభ్యదేశాలే. దాదాపు 19 లక్షల కోట్ల డాలర్ల భారీ ఆర్థికవ్యవస్థగా మారి చైనా అనేక అభివృద్ధి పథకాలను అందిస్తున్నది. మనదేశం 3.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకున్నది. ప్రపంచస్థాయిలో వేగంగా, పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నప్పటికీ ఈ రెండు దేశాలకు ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. మనదేశం ఇంకా ఎంతో అభివృద్ధిని సాధించవలసి ఉంది. ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడవలసి ఉంది. చైనా తన రెండవ శతాబ్ది లక్ష్యాలను చేరటానికి పరుగులు తీస్తున్నది. భారతదేశం 2047నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా పురోగమించాలని స్వాతంత్ర్యదిన సంకల్పంగా చెప్పుకున్నది. శాంతి సామరస్యాలు లేకపోతే ఇలాంటి లక్ష్యాలు సాధించలేం. అందువల్ల భారత, చైనాల మధ్య ఐక్యత, సహకారం నెలకొల్పుకోవాలి. అప్పుడే అవి తమ స్వంత అభివృద్ధిని మరింత వేగవంతం చేసుకోగలవు.

అయితే రెండు దేశాల మధ్య ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరువురి అంగీకారంతో నిర్ణయించుకున్న సరిహద్దులు లేకపోవటం ఇందులో ఒకటి. వలసపాలకులు సృష్టించి, మిగిల్చిపోయిన ఈ సమస్యలను నేటి అవకాశాలకు, అవసరాలకు తగిన విధంగా రాజకీయ విజ్ఞత, వివేకం ప్రదర్శించి పరిష్కరించుకోవాలని భారత–చైనా మిత్రమండలి కోరుతున్నది. అవాంఛనీయమైన ఉద్రిక్తతలు సడలించుకుంటే రక్షణవ్యయ భారం తగ్గించుకుని, మనకున్న ఆర్థికవనరులను గరిష్టంగా ప్రజల అభివృద్ధికి వినియోగించగలుగుతాం. ఇందుకోసం రాజకీయ సంకల్పంతో ముందుగా చైనాతో పూర్తిస్థాయిలో స్నేహసంబంధాలను పెంపొందించుకుని, అన్ని రంగాలలో సహకారాన్ని, సమన్వయాన్ని వృద్ధి చేసుకోవాలి. పరస్పర నమ్మకం, న్యాయబద్ధమైన ఆకాంక్షల పట్ల గౌరవంతో, ఇచ్చిపుచ్చుకునే వైఖరితో సరిహద్దుతో సహా అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించవచ్చని మిత్రమండలి భావిస్తున్చది.

ఇటువంటి అంశాలను చర్చించటానికి భారత, చైనా మైత్రీశక్తులను సమీకరించటానికి, పటిష్ఠం చేయటానికి భారత–చైనా మిత్రమండలి అక్టోబరు 14, 15 తేదీలలో హైదరాబాదులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌, విశ్వేశ్వరయ్య భవన్‌, ఖైరతాబాద్‌లో జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభలు జరుగుతున్నాయి. అనేకమంది మేధావులు, విదేశీ వ్యవహారాలను అధ్యయనం చేస్తున్న నిపుణులు సందేశాలనివ్వనున్నారు.

భారత–చైనా మిత్రమండలి, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌

Updated Date - 2023-10-13T01:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising