డిగ్రీ కాలేజీ లేని నూజివీడు
ABN, First Publish Date - 2023-09-08T00:48:50+05:30
నూజివీడులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లేకపోవటం అవమానకరం. ఏటా ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేస్తున్న విద్యార్థుల సంఖ్య 350 వరకూ...
నూజివీడులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లేకపోవటం అవమానకరం. ఏటా ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేస్తున్న విద్యార్థుల సంఖ్య 350 వరకూ ఉంటుంది. వీరందరూ పేద విద్యార్థులే. ప్రైవేట్ విద్యాసంస్థల్లో 1000 నుండి 1500 మంది విద్యార్థులు ఉంటారు. ఒకప్పుడు నూజివీడులోని ధర్మ అప్పారావు కళాశాలలో విద్య అభ్యసించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేవారు. ఈ ఎయిడెడ్ కళాశాలలో సీటు దొరకడమే కష్టమైన రోజులుండేవి. ఇప్పుడు ధర్మ అప్పారావు కళాశాల ప్రైవేట్ పరమైంది. ఈ కళాశాల ప్రైవేటుగా మారి రెండేళ్ళయినా ఇంతవరకు డిగ్రీ కాలేజీ ఏర్పాటు ఊసే లేదు. కొన్ని రోజులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, మరికొన్ని రోజులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో షిఫ్ట్ వైజ్‌గా డిగ్రీని నిర్వహిస్తామని చెబుతూ వచ్చారు. అది జరగకపోవడంతో విద్యార్థులు చదువుమానేస్తున్నారు. తక్షణమే నూజివీడులో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి.
కె. లెనిన్ (ఎస్ఎఫ్ఐ)
Updated Date - 2023-09-08T00:48:50+05:30 IST