ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుల్లెట్ యోగి

ABN, First Publish Date - 2023-04-18T03:01:31+05:30

ప్రత్యక్ష ప్రసార హత్యలు! అతీఖ్ అహ్మద్, అతని సోదరుడి హత్య మీద ప్రసిద్ధ కార్టూనిస్టు సతీశ్ ఆచార్య గీసిన వ్యంగ్య చిత్రంలో వ్యాఖ్య అదే! న్యాయదేవతను దగ్గరగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యక్ష ప్రసార హత్యలు! అతీఖ్ అహ్మద్, అతని సోదరుడి హత్య మీద ప్రసిద్ధ కార్టూనిస్టు సతీశ్ ఆచార్య గీసిన వ్యంగ్య చిత్రంలో వ్యాఖ్య అదే! న్యాయదేవతను దగ్గరగా కాల్చిచంపుతున్న ‘శక్తులు’ ఒకవైపు, అసత్యకథనాలతో పాత్రికేయతను హత్య చేస్తున్న అధికార మీడియా మరొకవైపు! ఎంతటి దౌర్జన్యమైనా చాటుమాటుగా, ముసుగులు వేసుకుని చేసే రోజులు పోయాయి! అంతా ‘లైవ్’!!

అచ్యుతన్న మురళీధర్ అనే మరో కార్టూనిస్టు వికాస్ దుబే ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, యోగి ఆదిత్యనాథ్ చేతిలో రివాల్వర్‌ను చిత్రించి, అందులో నుంచి వస్తున్న పొగను విలాసంగా వూదేస్తున్న వ్యంగ్య చిత్రం ఒకటి వేశారు. ఇప్పుడు అతిఖ్ సోదరుల హత్య తరువాత కూడా కొన్ని పత్రికలలో, యోగి ఆదిత్యనాథ్ తక్కిన వేళ్లను మడిచి చూపుడు వేలును, నడిమివేలును మాత్రం కలిపి రివాల్వర్ బ్యారెల్ లాగా ప్రదర్శిస్తున్న వ్యంగ్య చిత్రాలు వేశాయి.

వికాస్ దుబే కానీ, అతిఖ్ సోదరుల హత్యలు కానీ జరగడంలో యోగి ఆదిత్యనాథ్ ఘనత ఏమున్నది? ఆయన ఆ మరణాలు జరగాలని సంకల్పించారా? అలహాబాద్‌కు తరలించిన ప్రయాణంలోను, కోర్టు ముందు ప్రవేశపెట్టడంలోను మీడియా వేయి కళ్లతో గమనిస్తున్నందున తప్పిపోయిన ఎన్‌కౌంటర్ మరో రూపంలో, ఏకంగా మీడియా ముందే జరిగిపోయిందా? అందుకు ఆయన పథకం రూపొందించారా? లేకపోతే, ఆయనకు అభినందనలు, వీరకిరీటాలు ఎందుకు? మీడియా సమావేశంలో, మీడియా ప్రతినిధుల వలె మారువేషంలో వచ్చిన దుండగులు చేసిన హత్యకు యోగి కారకుడున్నట్టు ఆయన అభిమానులే సందడి చేస్తున్నారు! సందేశం అదేనా? అతిఖ్ నిర్మూలనలో యోగి ప్రతాపం ఉన్నదని జన హృదయం ప్రశంసాపూర్వకంగా విశ్వసిస్తున్నదా?

గుర్తించవలసినది ఏమిటంటే, అతీఖ్ నేరస్థుడే అయినా, అతని హత్య కూడా నేరమే. భారత రాజ్యాంగం నిర్దేశించిన నేరనిర్ధారణ, న్యాయవిచారణ, శిక్షా ప్రక్రియల ప్రకారం ఇది తప్పు. నాగరికమూ కాదు, సంస్కారయుతమూ కాదు. చట్టాలు తగినంత సమర్థంగా పనిచేయనందున, ఇటువంటి తక్షణ న్యాయమే పరిష్కారమని, యోగి అభిమానులు అనుకుంటున్నారు. మూక ఆలోచనలకు, ప్రతీకార భావనలకు అనుగుణంగా పాలనా యంత్రాంగం పరిష్కరించాలనుకుంటే అది ప్రమాదకరం.

అతీఖ్ హత్య గురించి మాట్లాడితే, చాలా మందికి కోపం వస్తున్నది. హత్య జరిగిన తీరు మీద సందేహాలు వ్యక్తం చేస్తే, ముఠాకోరు నేరస్థుడిని సమర్థిస్తున్నట్టు అనుకుంటున్నారు. రెండూ వేరు వేరు. అతిఖ్, అతని కుటుంబసభ్యులు, వారు చేసిన నేరాలు ఘోరాలు తీవ్రమైనవి. అటువంటి నేరస్థులను, నేరాలు చేయడానికి వారికి ఆస్కారమిస్తున్న వ్యవస్థలను వీలయినంత తీవ్రంగా శిక్షించవలసి ఉన్నది. కోర్టులు చేయవలసిన పనిని, ఇతర మార్గాల ద్వారా చేయడం న్యాయవ్యవస్థను ధిక్కరించడమే.

అతిఖ్ కుమారుడిని, మరొకరిని చంపివేసిన ఎన్‌కౌంటర్ గురించి కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే, యోగి ప్రభుత్వ హయాం ఆరేళ్ల కాలంలో, నేరస్థ ముఠాలను అదుపు చేయడం పేరిట అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిలో 183 మంది నిందితులు హతులయ్యారు. 13 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 59 మంది ముస్లిములు. తక్కినవారు హిందువులే. కాబట్టి, ఒక్క మతం వారిపై పోలీసుచర్యలు సాగుతున్నాయనడానికి లేదని యోగి సమర్థకులు చెబుతారు నిజమే. ఇక్కడ అతిఖ్ మతం గురించి కంటె, చట్టబద్ధత గురించిన చర్చ అవసరం. వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కూడా చట్టబాహ్య చర్య అన్న ఆరోపణలున్నాయి. అతిఖ్ హత్యలో మూడో పక్షం ప్రమేయం, సమాజం కలవరపడవలసిన పరిణామం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒకనాడు విజృంభించిన ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ఈ సందర్భంగా గుర్తువస్తున్నారు.

చట్టబాహ్య శిక్షలలో మతదృష్టి లేదు నిజమే కానీ, ఏ పక్షపాతమూ లేదని అనలేము. హిందూ మతానికి చెందిన హతులలో ఆదిత్యనాథ్ సామాజిక వర్గానికి చెందిన రాజపుత్రులెందరు? అన్న ప్రశ్న సహజంగానే కుతూహలం కలిగిస్తున్నది. పదిమందికి పైగా బ్రాహ్మణులు కూడా ఎన్‌కౌంటర్ అయినప్పుడు, ఠాకూర్లు రాజపుత్‌లు అసలే లేకుండా ఉండరు కానీ, వారి సంఖ్య ఉండవలసినదానితో పోలిస్తే కనీసమే. మాఫియాలు, నేరస్థుల అండ లేకుండా యుపిలో అధికార పార్టీకి అంగబలం సాధ్యమని ఎట్లా అనుకోగలం? నూరుకు పైగా కేసులున్న వారణాసి నేరచరితుడు బ్రిజేశ్ సింగ్ కానీ, అనేక కేసులున్న బదేహి ఉదయభాన్ సింగ్, మహోబాకు చెందిన బాద్షా సింగ్, గోండాకు చెందిన బ్రిజ్ భూషణ్ సింగ్ వంటి రాజపుత్రులు యుపి ప్రభుత్వం వారి చల్లటి చూపులలో సేదతీరుతున్నారని అఖిలేశ్ యాదవ్ ఆరోపిస్తున్నారు. హత్రాస్ సంఘటనలో పరామర్శకు పోయిన ముస్లిమ్ జర్నలిస్టును మూడేళ్ల జైలుతో వేధించారు కానీ, దోషులైన రాజపుత్రుల విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి కఠిన చర్యలకు చేతులు రాలేదు. జీపు కింద రైతులను తొక్కి చంపిన కేంద్రమంత్రి తనయుడి మీద చర్యకు పెద్ద కోర్టులు దిగిరావలసి వచ్చింది. నేరస్థులెవరైనా యోగికి ఒకటే అనేది చెప్పుకునేంత సత్యమైన మాట కాదు.

గుజరాత్ నమూనాను యుపి అనుసరించాలనుకుంటున్నారేమోనన్న అనుమానం వస్తున్నది. సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్‌కు ముందూ వెనుకా అనేక న్యాయాతీత హత్యలు జరిగాయి. ఒక చట్ట బాహ్య హత్య చేయడం, దాని సాక్షులను నిర్మూలించడం, ఇదంతా ఒక గొలుసుకట్టు ప్రక్రియ. ఇప్పుడు, ఎవరి పనుపునో, బెదిరింపు వల్లనో, ప్రలోభం వల్లనో అతిఖ్‌ను హత్య చేసి హంతకులయిన ఆ ముగ్గురు కూడా రేపు నిర్మూలనకు గురి కావచ్చు. ఇటువంటి విధానాలను అనుసరించి హీరోలుగా మారే రాజకీయ నేతలు అంతిమంగా ఫాసిస్టు పాలనకే దోహదకారులు అవుతారు. ఇది అతీఖ్‌కు సంబంధించిన విషయం కాదు. దేశ న్యాయపాలనకు సంబంధించిన సమస్య.

Updated Date - 2023-04-18T03:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising