ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దక్కని ఊరట

ABN, First Publish Date - 2023-07-11T03:32:53+05:30

సూరత్‌ కోర్టు తీర్పుమీద స్టే విధించడానికి గుజరాత్‌ హైకోర్టు నిరాకరించడంతో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కష్టాలు ఇంకా హెచ్చాయి. ‘దొంగలందరి ఇంటిపేరు’ వ్యాఖ్యద్వారా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూరత్‌ కోర్టు తీర్పుమీద స్టే విధించడానికి గుజరాత్‌ హైకోర్టు నిరాకరించడంతో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కష్టాలు ఇంకా హెచ్చాయి. ‘దొంగలందరి ఇంటిపేరు’ వ్యాఖ్యద్వారా రాహుల్‌ ఏకంగా మోదీ ఇంటిపేరుగా ఉన్న ఒక సమూహాన్నే అవమానించారంటూ దాఖలైన పరువునష్టం దావామీద సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ళజైలు విధించడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. దిగువకోర్టు వేసిన జైలు శిక్షను కాదనడానికి తనకు తగిన కారణాలు కనిపించడం లేదంటూ గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి హేమంత్‌ ప్రచ్ఛక్‌ తేల్చేశారు. దీనిపై సుప్రీంకోర్టుకు పోవాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకున్న విషయాన్ని అటుంచితే, గుజరాత్‌ కోర్టుల్లో తమకు న్యాయం జరగదని ముందే తెలుసు అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

‘ఈ తీర్పులు రాసేవారు, అనర్హత పిటిషన్లు వేసేవారు ఒకటి గుర్తుంచుకోవాలి. రాహుల్‌ లాంటి నాయకుడిని ఇవేవీ ఆపలేవు’ అంటూ కాంగ్రెస్‌ నాయకులు పైకి అంటున్నారు కానీ, రాహుల్ రాజకీయ భవిష్యత్తు ఈ కేసుతో ముడిపడివున్న వాస్తవం వారికీ తెలుసు. దీర్ఘకాలం సుషుప్తావస్థలో ఉన్న పరువునష్టం పిటిషన్‌ ఒక్కసారిగా వేగంపుంజుకోవడం, శిక్షపడటం, పార్లమెంటు సభ్యత్వం రద్దుకావడం, ఇల్లు ఖాళీచేయడం, న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగలడం వంటి వరుస పరిణామాలు రాహుల్‌ను రాజకీయ చిత్రపటం నుంచి పక్కకు తప్పించడానికేనని కాంగ్రెస్‌ నాయకుల నమ్మకం. ఎలాగూ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కోల్పోయినదాని గురించి రాహుల్‌ ఆలోచించ నక్కరలేదు కానీ, వచ్చే ఏడాది ఎన్నికల్లో నిలబడటమన్నది సుప్రీంకోర్టు దయమీదే ఆధారపడివుంది. సూరత్‌ కోర్టు న్యాయమూర్తి కంటే హైకోర్టు న్యాయమూర్తికి రాహుల్‌ చేసిన పరువునష్టం మరింత భయంకరమైనది తోచింది. మే 2న విచారణ పూర్తిచేసి, తీర్పును రిజర్వులో పెట్టిన ఆ న్యాయమూర్తి, సదరు సూరత్‌ కోర్టు తీర్పులో ఒక్కముక్క కూడా కాదనాల్సినదీ, తప్పుబట్టాల్సినదీ లేదని రెండునెలల తరువాత ప్రకటించారు. తీర్పులో భాగం అయినా కాకున్నా రాహుల్‌ అభ్యర్థనను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి చేసిన పలువ్యాఖ్యలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆశ్చర్యం కలిగించేట్టుగా ఉన్నాయి. వీర్‌సావర్కర్‌పై రాహుల్‌ చేసిన విమర్శను కూడా న్యాయమూర్తి అవసరార్థం గుర్తుకు తెచ్చుకున్నారు.

రాహుల్‌ తన వ్యాఖ్యతో కోట్లాదిమందికి మనస్తాపం కలిగించారనే కాక, రెండేళ్ళజైలుకు ఆయనకు పూర్తి అర్హుడని వివిధస్థాయి గుజరాత్‌ న్యాయమూర్తులు నిర్ధారించడం ఇది మూడోసారి. జైలుశిక్ష ఆర్నెల్లో, సంవత్సరమో ఉంటే, మాట తూలినందుకు రాహుల్‌కు సముచితశిక్షపడిందని ప్రజలూ భావించేవారు. కానీ, ఇంతకంటే భయంకరమైన నేరారోపణలను కూడా న్యాయస్థానాలు కొట్టివేస్తూ, ప్రజాప్రతినిధులకు చట్టసభసభ్యత్వాలను పునరుద్ధరిస్తుంటే, పరువునష్టం కేసులో గరిష్ఠశిక్ష రెండేళ్ళే అయినప్పుడు రాహుల్‌కు దానినే వర్తింపచేయడం వరుసగా దానినే ఎత్తిపట్టడం అనుమానాలకు దారితీస్తుంది. శిక్ష అమలును నిలిపివేస్తే ఆయన అనర్హత వేటునుంచి తప్పించుకుంటాడని, అందుకు రాహుల్‌ అర్హుడు కాదన్న వాదన హైకోర్టుకు సముచితంగా తోచింది. దీనికి ముందు ఒక మేజిస్ట్రేట్‌, ఒక సివిల్‌కోర్టు న్యాయమూర్తి ఏ విధంగా భాష్యం చెప్పారో అవే మాటలు హైకోర్టునుంచి కూడా వినబడ్డాయి. ‘మోదీ’ ఇంటిపేరున్నవారంతా ఒక గుర్తించగల, నిర్ధారించగల సమూహమని వ్యాఖ్యానించడం ద్వారా, ఈ పేరుతో భిన్నకులాల్లో, ప్రాంతాల్లో, వృత్తుల్లో ఉన్న 13కోట్లమంది రాహుల్‌ వ్యాఖ్యకు ప్రభావితం కాలేదన్న కీలకమైన వాదనను న్యాయస్థానం తెలివిగా వమ్ముచేసింది. ఫిర్యాదు చేసిన పూర్ణేశ్‌ మోదీ అనే బీజేపీ నాయకుడితో పాటు మిగతా కోట్లాది మనసులూ నొచ్చుకున్న విషయాన్ని న్యాయస్థానం ఏ ప్రాతిపదికన గణించిందో తెలియదు. కిందికోర్టుల ఈ తరహా తీర్పులపై ఆగ్రహిస్తున్న సుప్రీంకోర్టు రాహుల్‌ను ఒడ్డునపడేస్తుందా లేదా అన్నకంటే, ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికల సభల్లో చేసే వ్యాఖ్యలపై కేసులు నమోదుకావడమన్నది భావవ్యక్తీకరణ, వాక్‌స్వాతంత్ర్యాలపై ప్రభావం చూపుతుందా లేదా అన్నది ముఖ్యం. పరువునష్టం, అపకీర్తి ఇత్యాది ఆరోపణల విషయంలో సర్వోన్నతన్యాయస్థానం నిర్దిష్ట ప్రమాణాలను ఏర్పరచవలసి ఉంది.

Updated Date - 2023-07-11T03:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising