ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సెంథిల్‌ సెగ

ABN, First Publish Date - 2023-06-30T00:44:13+05:30

హవాలా ఆరోపణలమీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అరెస్టుచేసిన తమిళనాడు మంత్రి సెంథిల్‌బాలాజీని ఆ రాష్ట్ర గవర్నర్‌ గురువారం మంత్రివర్గం నుంచి సస్పెండ్‌ చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హవాలా ఆరోపణలమీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అరెస్టుచేసిన తమిళనాడు మంత్రి సెంథిల్‌బాలాజీని ఆ రాష్ట్ర గవర్నర్‌ గురువారం మంత్రివర్గం నుంచి సస్పెండ్‌ చేశారు. ఆయన మంత్రిగా కొనసాగడం వల్ల దర్యాప్తు ప్రక్రియకు విఘాతం కలగవచ్చు, ప్రభుత్వయంత్రాంగం పనితీరుమీద విశేషమైన ప్రభావం పడవచ్చు అంటూ రాజ్‌భవన్‌ సుదీర్ఘమైన ప్రకటన జారీచేసింది. క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌, మనీలాండరింగ్‌ వంటి ఆరోపణలతో పాటు, గతంలోనే ఆయనపై అనేక క్రిమినల్‌ కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని, వాటిని రాష్ట్ర పోలీసులు దర్యాప్తుచేస్తున్న సంగతినీ రాజ్‌భవన్‌ గుర్తుచేసింది. మంత్రివర్గం సూచనమేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సిన గవర్నర్‌ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదనీ, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు.

తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికీ, అధికార డీఎంకె ప్రభుత్వానికి మధ్య ఎంతోకాలంగా సాగుతున్న వైరం సెంథిల్‌బాలాజీ వ్యవహారంలో పతాకస్థాయికి చేరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అరెస్టుచేయగానే అంతవరకూ సెంథిల్‌ నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖలను మిగతావారికి కేటాయిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదించారు. కానీ, ఏ శాఖాలేని మంత్రిగా సెంథిల్‌ను కొనసాగించాలన్న స్టాలిన్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదించలేదు. అటువంటి సంప్రదాయం ఎన్నడూ ఎక్కడా లేదని కాకుండా స్టాలిన్‌ ప్రభుత్వంలో మాత్రమే అది కూడదని గవర్నర్‌ అనుకొని ఉంటారు. దీనితో తమిళనాడు ప్రభుత్వం ఒక జీవో తెచ్చి, అందులో శాఖల మార్పిడి విషయాన్ని మాత్రమే ప్రస్తావించి తద్వారా శాఖలేని మంత్రిగా ఆయన కొనసాగింపు సాగేట్టు చూసుకుంది. ఇప్పుడు గవర్నర్‌ ఏకపక్షంగా సెంథిల్‌ను తొలగించడంతో మళ్ళీ అగ్గిరాజుకుంది. సెంథిల్‌మీద గతంలో ఉన్న కేసుల సంగతి అటుంచితే, ప్రస్తుత వివాదం 2011–16 మధ్యకాలంలో ట్రాన్స్‌పోర్టు మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇస్తానంటూ డబ్బువసూలు చేశాడన్న ఆరోపణకు సంబంధించింది. లంచాలు ఇచ్చినవారికి పుచ్చుకున్నవారు చెప్పినట్టుగా ఉద్యోగాలు వస్తే ఇటువంటి వ్యవహారాలు వెలుగులోకే రావు. కానీ, ఎక్కడో లెక్క తేడావచ్చి వరుస పోలీసు ఫిర్యాదులతో ఈ కుంభకోణం బయటపడింది. సిట్‌ దర్యాప్తులో సెంథిల్‌ కుట్రంతా వెలుగుచూసి న్యాయస్థానాలకు చేరింది. పదమూడుమంది ఫిర్యాదుదారులకు తాను తిరిగి డబ్బులు ఇచ్చేశానని కేసు కొట్టివేయమని సెంథిల్‌ చివరకు న్యాయస్థానాన్ని అభ్యర్థించాడంటేనే విషయం అర్థమవుతోంది. ఏ కారణాలవల్లో మద్రాస్‌ హైకోర్టు ఈ జాబ్స్‌ ఫర్‌ క్యాష్‌ కేసును కొట్టివేస్తే, సుప్రీంకోర్టు అడ్డుపడి, హైకోర్టు ఆదేశాలను రద్దుచేసి చర్యలకు ఆదేశించడంతోనే ఈ వ్యవహారం అరెస్టులవరకూ వచ్చింది. అన్ని అవినీతికేసుల్లోనూ సుప్రీం ఆదేశాలమేరకు కేంద్రం ఇలాగే వ్యవహరిస్తున్నదా, ఇందులో రాజకీయం లేదా అన్నది అటుంచితే సెంథిల్‌ మచ్చలేని అమాయకుడైతే కాదు. ‘రవాణామంత్రి తన శాఖను అమ్మకానికి పెట్టేశాడు. అవినీతి, దోపిడీ, అక్రమ వసూళ్ళు, భూకబ్జాలు, అపహరణలతో రాజకీయంగా ఎదిగిపోయాడు. పదిహేనుసార్లు మంత్రివర్గం మార్పులు జరిగినా ఆ అవినీతిపరుడి స్థానం పదిలం. ఆయన అవినీతిమీద శాసనసభలో నేను స్వయంగా సాక్ష్యాలు సమర్పించినా చర్యలు లేవు. చివరకు ఆమె (జయలలిత) జైలుకు పోయినప్పుడు కూడా ఈయన పేరునూ ముఖ్యమంత్రి పదవికి పరిశీలించారు’ అంటూ స్వయంగా స్టాలిన్‌ 2016 ఎన్నికల ప్రచారసభలో సెంథిల్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. సెంథిల్‌ను ఈడీ అరెస్టు చేసినప్పుడు డీఎంకె విమర్శలు చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులు దీనిని ప్రచారంలో పెట్టివుండవచ్చును కానీ, స్టాలిన్‌ వీటిని కాదనలేరు. ఒక బలమైన గౌండర్‌ కులానికి చెంది తమిళనాడులోని అత్యధికప్రాంతాలను రాజకీయంగా శాసించే స్థాయికి ఎదిగిన సెంథిల్‌ను వదులుకోవడం స్టాలిన్‌కు రాజకీయంగా నష్టమే. కానీ, శశికళ కారణంగా ఎదిగిన సెంథిల్‌ను ఒక దశలో జయలలిత కూడా దూరం పెడితే కొంతకాలం దినకరన్‌ వర్గంలో ఉండి, కేవలం రాజకీయార్థిక ప్రయోజనాలకోసం డీఎంకెలో చేరిన సెంథిల్‌కు బలమైన మంత్రిత్వశాఖలే దక్కాయి. ఇటువంటివారివల్ల ప్రయోజనం కంటే కష్టనష్టాలు అధికమైనప్పుడు సత్వరమే వదిలించుకోవడం రాజకీయంగా శ్రేయస్కరం. న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని స్టాలిన్‌ ఇప్పుడు అనడం కూడా అందుకే కావచ్చు.

Updated Date - 2023-06-30T00:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising