ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చర్చను రక్షించండి!

ABN, First Publish Date - 2023-09-15T00:31:34+05:30

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆ అత్యున్నత సభ డెబ్భై ఐదేళ్ల ప్రయాణాన్ని చర్చించబోతుందని ప్రభుత్వం తెలిపింది...

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆ అత్యున్నత సభ డెబ్భై ఐదేళ్ల ప్రయాణాన్ని చర్చించబోతుందని ప్రభుత్వం తెలిపింది. ఇంతవరకూ ఆకస్మిక సమావేశాల ఎజెండా ఏమిటో తెలియక ఊహాగానాలు చేస్తున్న వారికి ఈ ప్రకటనతో స్పష్టత వచ్చిందని భావించలేం. ఇది ఒక అంశం కావొచ్చు గానీ ఇంకా ఏదో మిగిలే ఉందన్నది మెజారిటీ అభిప్రాయం. పార్లమెంట్ ప్రస్థానం, విజయాలు, నడకలో మార్పులు అన్నీ చర్చించబోవడం మంచిదే. ఒకప్పుడు ఆరోగ్యకరమైన చర్చలు ఎక్కువ జరిగేవి. ప్రాముఖ్యత కలిగిన అంశాలు లోతుగా పరిశీలించబడేవి. ప్రభుత్వం పార్లమెంట్‌కి పూర్తి జవాబుదారీగా వుండేది. చర్చలు ఎంత గంభీరంగా సాగినా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండేది. మరీ ప్రాముఖ్యమైన అంశాలను కమిటీలు లోతుగా చూసేవి. ఆ దారి నుండి పార్లమెంట్ నేడు పక్కకు జరుగుతోంది. ఆర్థిక బిల్లులతో సహా ముఖ్యమైనవి చర్చ లేకుండానే పాస్ అయి పోతున్నాయి. అవరోధాలు, అవాంతరాలు నిత్యకృత్యంగా మారాయి. చర్చాసమయం రానురాను కుచించుకుపోతోంది. ప్రాముఖ్యత కలిగిన ప్రకటనలు కూడా సభ వెలుపలనే వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రజాస్వామిక పాలనా విధానంలో పార్లమెంట్ స్థాయిని, ప్రాముఖ్యతని పలుచన చేసేవే. కాబట్టి వాస్తవికమైన సమీక్ష అవసరమే. పాలక, ప్రతిపక్షాలు ఒకరి నొకరు నిందించుకోకుండా అర్థవంతమైన సమీక్ష చెయ్యాలి. పార్లమెంట్ పనితీరుపై చర్చ ఎలాంటి వాకౌట్లు, స్లోగన్లు, వాయిదాలు లేకుండా జరగాలని దేశం ఎదురు చూస్తుంది. నూతన భవనంలో నూతనోత్తేజంతో చర్చల సంస్కృతి పునరాగమనం చెయ్యాలి.

డి.వి.జి. శంకరరావు

Updated Date - 2023-09-15T00:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising