ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రెండుచోట్ల పోటీ తగునా కేసీఆర్‌ ?!

ABN, First Publish Date - 2023-10-25T02:06:34+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రెండు చోట్ల పోటీ చేస్తానని గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాలను ఎంపిక చేసుకున్నాడు. గతంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ రెండేసి పార్లమెంటరీ నియోజక వర్గాలకు...

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రెండు చోట్ల పోటీ చేస్తానని గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాలను ఎంపిక చేసుకున్నాడు. గతంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ రెండేసి పార్లమెంటరీ నియోజక వర్గాలకు; నందమూరి తారకరామారావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు రెండు చోట్ల అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు.‍ 1969 తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమ కాలంలో సమైక్య వాది అయిన ఎన్టీఆర్ తాను తీసిన ‘తల్లా పెళ్ళామా’ చిత్రంలో ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాదే’ అని ఒక పాట పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు ప్రాంతాలలో తన అధిపత్యం నిరూపించు కోవడానికి మూడు చోట్ల పోటీ చేసాడు.

మరి ఇప్పుడు ‘తెలంగాణ రాష్ట్ర తొలి, మలి ముఖ్యమంత్రి’ రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నట్లు? ఓడిపోతాననే భయమా, ఆధిపత్య ధోరణా? గోల్కొండ కోటకు ఉత్తరం వైవు వెలమ శాసన సభ్యుల కారిడార్లో రెండు చోట్ల పోటీ చేయడంలో ఆయన ఉద్దేశాలు ఏమిటో? వ్యూహం, ఎత్తుగడలలో రాజ నీతి ఏమైనా ఉండవచ్చు. అయితే, అన్ని నియోజక వర్గాలను సమానంగా చూడాల్సిన ఒక బాధ్యత గల ముఖ్య మంత్రి అయివుండి, అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెండో నియోజక వర్గాన్ని కూడా ఎంపిక చేసుకోవడాన్ని ఈ 21వ శతాబ్దంలో ఒక ప్రజా స్వామిక సమాజ పౌరులుగా మనం అంగీకరించవలసిన అవసరం ఏముంది? ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది? తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒక దాన్ని తప్పనిసరిగా వదులు కోవాల్సిన పరిస్థితి వున్నప్పుడు, ఇంత ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం న్యాయమైనదా?ఇదే మన్న వ్యక్తి గతమైన వ్యవహారమా? తాము ఓటు వేసి గెలిపించిన నాయకుడు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ నియోజక వర్గ ప్రజల మనోభావాలు దెబ్బతినవా? తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాన్ని వదిలేస్తాడని తెలిసి ఆ వదిలేది తమ నియోజక వర్గమే అనుకుని రెండు చోట్ల ఓడిస్తే?! పోనీ రెండు చోట్ల గెలిపిస్తే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేసి మళ్ళీ వెంటనే ప్రజా ధనాన్ని, ఎన్నికల సిబ్బంది శ్రమను, ప్రజల విలువైన సమయాన్ని కొల్లగొట్టడం కాదా? స్వయం ప్రతి పత్తి గల భారత ఎన్నికల సంఘం దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలి. ఎవరు కూడా ఒకే ఎన్నికలో పలు చోట్ల పోటీ చేయకుండా ఒక చోట మాత్రమే చేసేలా చూడాలి. అది కుదరనప్పుడు ఒక అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేసి గెలిచి ఒక దానికి రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఖర్చు అతని దగ్గర తీసుకోవాలి. గజ్వెల్, కామారెడ్డి ప్రజలు కేసీఆర్ ను అడగాలి ఏ నియోజక వర్గాన్ని ఉంచుకుంటాడో. కేసీఆర్ ముందే ఆ సంగతి ప్రకటించాలి. అలా చేయకపోతే రెండు చోట్లా ఓడించాలి. కేసీఆర్ మీద పోటీ చేస్తామని గద్దర్ తో సహా చాలా మంది ప్రకటించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ కూడా అంటున్నారు. ఈటెలకు పార్టీ కూడా అనుమతి ఇచ్చింది. కేసీఆర్ ను ఓడించి తీరాలని అనుకుని గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి ఈటెల నిర్ణయించుకున్నాడు. కేసీఆర్ ఏమో రెండు చోట్ల పోటీ చేస్తుండు. మరి ఈటెల ఇప్పుడు గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలి కదా? గజ్వేల్‌లోనే పోటీ చేయడంలో అర్ధం లేదు. ఈటెలను కూడా ప్రజలు ఇలాగే అడగాలి. గెలిస్తే రాజీనామా చేసే చోట అయ్యే ఖర్చు తనే భరించాలి. బాధ్యత గల ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఒకే చోట పోటీ చేయాలి. బాధ్యత గల ప్రతి పక్ష నాయకుడిగా ఈటెల కూడా ఒక్కచోటనే పోటీ చేయాలి. మీరు ప్రజలను ఉద్ధరించక పోయినా పర్వాలేదు కానీ మీ వ్యక్తి గత ఆధిపత్యాలకు ప్రజలను బలి చేయకండి. మీరు ప్రజలకు భారం కాకండి.

వేనేపల్లి పాండురంగారావు

‘మట్టి మనిషి’

Updated Date - 2023-10-25T02:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising