ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విఫల నేతల కుటిల విమర్శలు !

ABN, First Publish Date - 2023-09-20T01:28:19+05:30

‘‘పథ్ కా అంతిమ లక్ష్య నహీ హై సింహాసన్ చడ్‌తే జానా/ సబ్‌ సమాజ్‌ కో లియే సాథ్‌మే ఆగేహీ బడ్‌తే జానా...’’ ఇది నా బాల్యం నుంచి సంఘ శాఖలో వింటున్న గొప్ప దేశభక్తి గీతం...

‘‘పథ్ కా అంతిమ లక్ష్య నహీ హై సింహాసన్ చడ్‌తే జానా/ సబ్‌ సమాజ్‌ కో లియే సాథ్‌మే ఆగేహీ బడ్‌తే జానా...’’ ఇది నా బాల్యం నుంచి సంఘ శాఖలో వింటున్న గొప్ప దేశభక్తి గీతం. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ అంతిమ లక్ష్యం సమాజసేవ, దేశ ప్రజల హితమే కావాలి కానీ స్వప్రయోజనం లేదా స్వార్థ ప్రయోజనాలు కావు అనేది ఆరెస్సెస్ నా లాంటి ఎందరో కార్యకర్తలకు ప్రవచించిన మార్గం. దేశ రాజధాని ఢిల్లీలో జరి గిన జీ–20 సమావేశాల సందర్భంగా భారత్ సమస్త మానవాళి శ్రేయస్సును కోరుతూ ప్రపంచ దేశాలకు చాటింది ఇదే. దీనినే బీజేపీ తన ఆచ రణలో చూపిస్తుంది. ఈ పయనంలో కొన్ని నిర్ణయాలు అందరికీ రుచించకపోవచ్చు. బీజేపీ పని విధానం అర్థం కాని కొందరు అపరిపక్వ చపలచిత్త రాజకీయ నాయకులకు ఇవి పొరపాట్లుగా కనిపిస్తాయి. ‘అసలు తెలంగాణలో బిజెపి అధికారాన్ని ఆశిస్తున్నదా?’ అనే శీర్షికన మా పార్టీ మాజీ శాసనసభ్యులు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి రాసిన వ్యాసంలో (08–09–2023) ఇదే స్పష్టమయ్యింది.

తెలంగాణ ఉద్యమం తీవ్ర దశలో ఉండి, టీఆర్ఎస్ గాలులు బలంగా వీస్తున్న సమయంలో పాలమూరులో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో కేవలం బీజేపీ కార్యకర్తల బలంతో, కమలం పువ్వు గుర్తుపై గెలిచిన ఎన్నం శ్రీనివాస్ రెడ్డి తన దశాదిశాలేని దూరచూపులేమితో బీజేపీని విమర్శించడం హాస్యాస్పదం. ఇలాంటి స్థిమితం లేని వైఖరి కలిగిన మరికొంత మంది రాజకీయ నాయకులు ఒక పార్టీలో చేరి తమ ఆశలు నెరవేరని పక్షంలో అదే పార్టీపై విమర్శలు చేస్తుంటారు. పోనీ వీరేమన్నా మళ్లీ అదే పార్టీలో చేరరా అంటే దానికి వారే పక్కా సమాధానం చెప్పలేరు. కేవలం తమ వైఫల్యంతో ప్రజాక్షేత్రంలో ఓటమి పాలై తీరా సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం బీజేపీని, ఆ పార్టీ అధినాయకత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తుంటారు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ చిత్తశుద్ధి ఎలాంటిదో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. నేడు తెలంగాణ ఉద్యమకారుల ఆశలు, అమరవీరుల త్యాగాల పునాదుల మీద అధికారం వెలగబెడుతూ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కిన టీఆర్‌ఎస్ పార్టీ పుట్టుక ఆనవాళ్లు కూడా లేని సమయంలోనే తెలంగాణ ఏర్పాటు కోసం తన సమ్మతిని తెలిపి ఉమ్మడి రాష్ట్రంలోనే తీర్మానం చేసిన ఘనత బీజేపీది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే గతంలో మూడు రాష్ట్రాలను సవ్యంగా, సామరస్యంగా ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వ స్ఫూర్తి నుంచి పాఠం నేర్చుకోకుండా కేవలం అధికారం కోసం ప్రజల మధ్య వైషమ్యాలను పెంచేలా వ్యవహరించిన నాటి అధికార కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని మాత్రమే బీజేపీ నేతలు ఆయా సందర్భాలలో ప్రశ్నించారు. అయినా తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు అభ్యంతరమైతే మొదటిసారి బీజేపీ టిక్కెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్నం శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయి, బీజేపీని వీడి, స్వంతంగా తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించి, ఆనక ఆ పార్టీని భూస్థాపితం చేసి, మళ్లీ బీజేపీలో ఎందుకు చేరినట్టో? చేరిన అనంతరం పార్టీ వ్యతిరేక చర్యలతో సస్పెన్షన్ వేటు పడ్డాక బీజేపీని విమర్శించడమంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గులా ఉంది వారి తీరు. దేశంలో తన ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రావడం కోసం ఇలాంటి అరువు నేతలతో అబద్ధపు ప్రచారం ఎంత చేసినా రేపటి తెలంగాణ గడ్డపై ఎగరబోయేది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బీజేపీ జెండా మాత్రమే.

డా. సోలంకీ శ్రీనివాస్

బీజేవైఎం జాతీయ కార్యదర్శి

Updated Date - 2023-09-20T01:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising