ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంస్కరణవాది పిఠాపురం మహారాజా

ABN, First Publish Date - 2023-10-05T02:54:15+05:30

ఆంధ్రదేశపు సంస్కరణ పోషకులు, సాంస్కృతిక కళా వికాస మూర్తీ, ప్రజాపక్షం వహించే పరిపాలకులూ పిఠాపురం మహారాజా రావువెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885–1965) తెలుగు జాతిని...

ఆంధ్రదేశపు సంస్కరణ పోషకులు, సాంస్కృతిక కళా వికాస మూర్తీ, ప్రజాపక్షం వహించే పరిపాలకులూ పిఠాపురం మహారాజా రావువెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885–1965) తెలుగు జాతిని సంస్కరణల మార్గంలో నడిపేందుకు తన గురువు దివాన్ మొక్కపాటి సుబ్బారాయుడు చూపిన అభ్యుదయ మార్గంలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికై అలుపెరుగక పరిశ్రమించారు.

సూర్యారావు రసజ్ఞత కలిగిన కవి, రచయిత, తత్వవేత్త. నిరంతర పాఠకుడు, సద్విమర్శకుడు. వివిధ రంగాల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎన్నదగ్గవి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ పిలుపునందుకుని అప్పట్లో పాతిక వేలు అందించి, ఆనాటి జమీందార్లలో దేశభక్తికి ఊపిర్లూదారు. రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ అభివృద్ధికి, కలకత్తాలోని సిటీ కాలేజి అభివృద్ధికి, రాజమండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు నిర్మాణానికీ ఆర్థికంగా ఆయన అందించిన సేవలు అనన్యసామాన్యమైనవి. సంఘ సంస్కరణోద్యమానికి ఆదర్శంగా నిలిచిన బ్రహ్మసమాజ ఉద్యమ ప్రాచుర్యానికి ఆయన తోడ్పాటునందించారు. దక్షిణ భారతదేశంలో ఈ ఉద్యమానికి ఎనలేని సేవచేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. నభూతో నభవిష్యత్ అనే విధంగా కాకినాడలో బ్రహ్మసమాజ మందిరాన్ని నిర్మించారు. 1933లో బ్రహ్మసమాజ సూత్రధారి రాజారామ్మోహన్ రాయ్ శత వర్ధంతిని నిర్వహించారు. ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ఈ సందర్భంగా ప్రచురించారు. మతసామరస్యం కోసం అంకితభావంతో శ్రమించే వీరు నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ గౌరవాన్ని పొందిన రెండవ భారతీయ రాజుగా ఘనత సాధించారు.

అసంఖ్యాక విశిష్ట గ్రంథాలను ప్రచురించడం, సాంస్కృతిక సామాజిక వికాసానికి తోడ్పాటును అందిస్తూ ఆంధ్ర సాహిత్య పరిషత్తును మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ లాంటి సమగ్రమైన నిఘంటువు తెలుగులో కూడా అవసరమనే ఆశయంతో సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణాన్ని ఒక బృహత్కార్యంగా చేపట్టి తెలుగుజాతికి అందించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అనాధాశ్రమంగా కరుణాలయం (అనాధాశ్రమం అని పిలవడం ఇష్టం లేక ఈ పేరు పెట్టారు) స్థాపించారు. నిమ్న వర్గాల వారిని పేరు చివరన ‘గాడు’ అని చేర్చి అవమానంగా పిలవడాన్ని నిషేధించాలనే బిల్లును ప్రవేశపెట్టి, విజయం సాధించారు.

మహాత్మాగాంధీ చేపట్టిన మద్యపాన నిషేధ ఉద్యమం కంటే ముందుగానే పిఠాపురం సంస్థాన పరిధిలో కల్లు తాగడాన్ని నిషేధించారు. కాకినాడలోని పిఆర్ కళాశాల ద్వారా దేశంలో అత్యున్నత విద్యనందించి చరిత్రలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. భాషాభివృద్ధి, సాహిత్యం, సంగీతం, తర్కం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం, క్రీడలు, రాజకీయాలు, సేవా రంగం, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వివిధాంశాల్లో ఎనలేని సేవలందించి తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి అనితరసాధ్యమైన కృషి చేసిన పిఠాపురం మహారాజా సూర్యారావును స్మరించుకోవడం తెలుగువారి బాధ్యత.

ర్యాలి ప్రసాద్, చరిత్ర పరిశోధకులు

(రేపు పిఠాపురం మహారాజా జయంతి)

Updated Date - 2023-10-05T02:54:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising