ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబు ‘విజన్’లో అవినీతికి చోటు లేదు !

ABN, First Publish Date - 2023-09-20T01:30:37+05:30

నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో ఎంతో ప్రత్యేకం. తెలుగుజాతి శక్తిని, ముఖ్యంగా యువత మేధాశక్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రకాశింప చేయటంలో కీలకపాత్ర పోషించారు...

నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో ఎంతో ప్రత్యేకం. తెలుగుజాతి శక్తిని, ముఖ్యంగా యువత మేధాశక్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రకాశింప చేయటంలో కీలకపాత్ర పోషించారు. అంతర్జాతీయంగా తెలుగువారి ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేశారు. హైదరాబాద్ నగరాన్ని ఇంటర్నేషనల్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దటంలో ఘనమైన పాత్ర పోషించారు. సమాజ పురోగతికి వెన్నెముక వంటి యువత ఆలోచనలను ఉన్నత విద్యాభ్యాసం వైపు, లక్ష్యసాధన వైపు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే యువత భవితవ్యం కోసం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ప్రోగ్రాంలో అవినీతి జరిగిందంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆయనను జైల్లో పెట్టడం ప్రపంచవ్యాప్తంగా యువతను కలవరపాటుకు గురిచేసింది. అందుకే ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సైతం యువత ముఖ్యంగా ఐటీ నిపుణులు రోడ్లపైకి వచ్చి భారీ ప్రదర్శనలు, నిరసన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ప్రణాళికలను, పని విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే మొత్తం అంతా పేదరికం నిర్మూలన, సంపద సృష్టి, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, సౌకర్యాల ఏర్పాటు చుట్టూనే తిరుగుతుంది. ఎంతో పురాతన నగరంగా ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందటంలో చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిది. అంతెందుకు ఆయనతో, లేదా ఆయన హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవస్థలతో కొద్దిపాటి పరిచయం ఉన్న అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే– చంద్రబాబు నాయుడు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఏదో ఒక పని చేస్తూ ఉంటారని. అవినీతి సొమ్ము ఆర్జనే లక్ష్యం అయితే ఇదంతా ఆయనకు అవసరమా! మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే– ఇంతగా పాలనాంశాలపై దృష్టి సారించే చంద్రబాబు నాయుడు రాజకీయాల కూడికలు తీసివేతల లెక్కలు పట్టించుకోరంటే ఆశ్చర్యం కలుగుతుంది. 2004లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత తన సీనియర్ సహచరునితో కలిసి కారులో ప్రయాణిస్తూ తాను కట్టిన నిర్మాణాలను చూస్తూ ఇంత అభివృద్ధి చేసిన తరువాత కూడా మనం ఎలా ఓడిపోయాం అని ఆశ్చర్యపోతూ అడిగారట. అప్పుడు ఆ సహచరుడు సమాధానమిస్తూ, ‘సార్ మీ విజన్ ఎంతో ముందుకు ఉంటుంది. అది ప్రజలకు అర్థం కావాలంటే చాలా సమయం పడుతుంది’ అని చెప్పారట. ఇది జరిగి సుమారుగా రెండు దశాబ్దాలైనా అభివృద్ధి విషయంలో ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో ఏ విధమైన మార్పు లేదు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సుమారుగా ఏడాది క్రితం ఎంపవర్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా యువతకు వివిధ కోర్సుల్లో నైపుణ్యం పెంచుకునేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఇలా పార్టీ కార్యాలయాన్ని కూడా యువత ఉన్నత భవిష్యత్తుకు ఉపయోగపడే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటరులా తీర్చిదిద్దటం ఆ అంశంపై ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియచేస్తోంది. అధికారంలో లేకపోయినా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న తపన గల చంద్రబాబు నాయుడు ఈ అన్యాయపు ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా తప్పక బైటికి వస్తారు!

పిఎన్ శ్రీనివాసరావు

సీనియర్ జర్నలిస్టు

Updated Date - 2023-09-20T01:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising