ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ పాపం నెతన్యాహుదే !

ABN, First Publish Date - 2023-10-13T01:17:15+05:30

సిమ్చాట్ టోరా (యూదుల సంప్రదాయ సెలవు దినం) రోజున ఇజ్రాయెల్‌కు వాటిల్లిన విపత్తుకు బాధ్యత స్పష్టంగా ఒక వ్యక్తిదే. ఆ వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు. తన అపార రాజకీయ అనుభవానికి...

సిమ్చాట్ టోరా (యూదుల సంప్రదాయ సెలవు దినం) రోజున ఇజ్రాయెల్‌కు వాటిల్లిన విపత్తుకు బాధ్యత స్పష్టంగా ఒక వ్యక్తిదే. ఆ వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు. తన అపార రాజకీయ అనుభవానికి, భద్రతా వ్యవహారాలలో సాటిలేని విజ్ఞత, దక్షతలకు ప్రధానమంత్రి నెతన్యాహు ఎంతగానో గర్విస్తుంటారు. పాలస్తీనా భూభాగాలను బలవంతంగా ఆక్రమించుకుని, పాలస్తీనియన్లను నిరాశ్రయులను చేసే ప్రభుత్వాన్ని నెలకొల్పుతున్నప్పుడు, కీలక బాధ్యతలలో బెజలెల్ స్మోట్రిష్, ఇటామల్ బెన్–గ్విర్‌లను నియమిస్తున్నప్పుడు, పాలస్తీనియన్ల ఉనికి, హక్కులను ఎటువంటి మినహాయింపులు లేకుండా నిర్లక్ష్యం చేస్తున్న విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నపుడు ఇజ్రాయెల్‌ను తాను ఉద్దేశపూర్వకంగా ఎటువంటి ప్రమాదాలలోకి నడుపుతున్నదీ గుర్తించడంలో నెతన్యాహు విఫలమయ్యారు.

ప్రస్తుతం ఇజ్రాయెలీలను, పాలస్తీనియన్లను అతలాకుతలం చేస్తున్న యుద్ధానికి నెతన్యాహు ఎంతగానో బాధ్యుడు. అయితే తన ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆయన తప్పక ప్రయత్నిస్తారు. ఈ వినాశనానికి ప్రధాన బాధ్యతను సాయుధ బలగాల ప్రధానాధికారులు, సైనిక గూఢచర్య విభాగం, షిన్‌బెట్ సెక్యూరిటీ సర్వీస్‌పై మోపుతారు. ఐదు దశాబ్దాల క్రితం యామ్ కిప్పూర్ యుద్ధ సందర్భంలోనూ వాటిల్లనున్న ప్రమాదాన్ని గుర్తించడంలో ఆనాటి సైనికాధికారులు విఫలమయ్యారు. తమ పూర్వీకుల వలే ఇప్పుడూ హమాస్ దాడి నెదుర్కోవడంలో ఒక చిన్నపాటి యుద్ధానికి తమ సన్నాహాలు లోపభూయిష్టంగా ఉన్నాయని నేటి సైనికాధికారులు నిరూపించారు.

తమ శత్రువును, పెద్ద ఎత్తున సైనిక దాడులు నిర్వహించడంలో అతడి శక్తి సామర్థ్యాలను వారు ఉపేక్షించారు. రాబోయే రోజులు, వారాలలో ఇజ్రాయెల్ రక్షణ దళాల, గూఢచార వర్గాల వైఫల్యాలు బహిర్గతమయినప్పుడు, వాటికి బాధ్యులయిన అధికారులను తొలగించి, ఈ దురదృష్టకర ఘటన పూర్వాపరాలను సమగ్రంగా సమీక్షించాలనే సమర్థనీయమైన డిమాండ్ తప్పకుండా వస్తుంది.

అయితే, సైనికాధికారుల, గూఢచార వర్గాల వైఫల్యం, సంక్షోభానికి మొత్తం బాధ్యత నుంచి నెతన్యాహును బయటపడవేయలేవు. ఇజ్రాయెల్ విదేశీ, భద్రతా వ్యవహారాలలో అంతిమ నిర్ణయం ఆయనదే గనుక ప్రస్తుత పరిస్థితికి అతడే ప్రధాన బాధ్యుడు అవుతాడు. రెండో లెబనాన్ యుద్ధంలో ఎహుద్ ఒల్మెర్ట్ వలే దౌత్య, రక్షణ వ్యవహారాలలో నెతన్యాహు అనుభవం లేని నాయకుడు ఏమీ కాదు. అలాగే 1973లో గోల్డా మెయిర్, 1982లో ఎమ్.బెగిన్ వలే సైనిక వ్యూహాలు, ఎత్తుగడల గురించి అసలేమీ తెలియనివాడూ కాదు.

నఫ్తాలీ బెన్నెట్, యాయిర్ లాపిడ్‌ల నాయకత్వంలో స్వల్పకాలం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్ని కూడా నెతన్యాహునే రూపొందించారు. పాలస్తీనా భూ భాగాలు గాజా, వెస్ట్ బ్యాంక్‌లు రెండిటిలోనూ పాలస్తీనియన్ జాతీయోద్యమాన్ని, ఇజ్రాయెల్ ప్రజలకు పూర్తిగా ఆమోదయోగ్యమైన రీతిలో అణచివేసేందుకు బహు విధాలుగా ప్రయత్నించడమే ఆ ప్రభుత్వాల విధానం.

యుద్ధాలకు దూరంగా ఉండే, ఇజ్రాయెల్‌కు భారీ నష్టాల సంభవనీయతను నివారించేందుకు అత్యంత జాగ్రత్తగా, సదా అప్రమత్తంగా ఉండే నాయకుడుగా నెతన్యాహు గతంలో తనను తాను ప్రజలకు నివేదించుకునేవారు. గత ఎన్నికలలో విజయం సాధించిన దరిమిలా ఆ వైఖరికి ఆయన స్వస్తి చెప్పారు. తన నాయకత్వంలోని ప్రభుత్వం ఏ విధానాన్ని అయితే అనుసరిస్తుందో అదే సరైన విధానమనే నిశ్చిత వైఖరిని నెతన్యాహు ప్రదర్శించసాగారు. ఆ విధానం ప్రకారమే వెస్ట్ బ్యాంక్‌ను ఆక్రమించుకుని, కలుపుకునేందుకు బాహాటంగా చర్యలు చేపట్టారు. హెబ్రాన్ హిల్స్, జోర్డాన్ లోయతో సహా ఓస్లో ఒడంబడిక హద్దులు ఏర్పరిచిన ఏరియా– సి లోనూ పాలస్తీనియన్ల సంపూర్ణ సంహారకాండకు కూడా ఆయన ఎటువంటి దాపరికం లేకుండా చర్యలు చేపట్టారు.

సుప్రసిద్ధ అల్–అక్సా మస్జీద్‌కు సమీపంలోని టెంపుల్ మౌంట్‌పై యూదుల ఉనికిని మరింతగా పెంపొందించడం, కొత్త జనవాసాలను భారీ స్థాయిలో విస్తరింపచేయడం కూడా ఆ చర్యలలో భాగమే. అంతేకాదు సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్ కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందం (దీనితో పాలస్తీనియన్లకు ఒరిగేది శూన్యం) గురించి నెతన్యాహు ఘనంగా చెప్పుకుంటున్నారు. తన నేతృత్వంలోని పాలక సంకీర్ణంలో రెండో ‘నక్బా’ (పెద్ద ఆపద) గురించి కూడా ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఊహించినట్టుగానే వెస్ట్ బ్యాంక్‌లో ఘర్షణలు ప్రజ్వరిల్లాయి. ఇజ్రాయోలీ ఆక్రమణదారు తమను పూర్తిగా అణచివేస్తున్నాడని పాలస్తీనియన్లు గట్టిగా భావించసాగారు. ఇజ్రాయెల్‌పై దాడికి ఇదొక అవకాశమని హమాస్ గుర్తించింది. ఫలితంగానే అక్టోబర్ 7 (శనివారం)న ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడులతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ఇటీవలి సంవత్సరాలలో ఇజ్రాయెల్‌కు పొంచివున్న ప్రమాదమేమిటో పూర్తిగా తెలిసివచ్చింది. ప్రధాని నెతన్యాహు మూడు అవినీతి కేసులలో నిందితుడుగా ఉన్నారు. నేరారోపణలను ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి దేశ పాలనా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరు. సంభావ్య జైలు శిక్షను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ జాతీయ ప్రయోజనాలకు అనివార్యంగా తక్కువ ప్రాధాన్యమిస్తారు. తన స్వప్రయోజనాలకు, ఆత్మరక్షణకే నెతన్యాహు ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరిట దాన్ని పూర్తిగా తనకు అనుకూలం చేసుకునే చర్యలు చేపట్టారు. సైనిక దళాల ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులను తన రాజకీయ ప్రత్యర్థులుగా పరిగణిస్తూ వారిని బలహీనపరిచేందుకూ ప్రయత్నించారు. పశ్చిమ నెగేవ్ ఆక్రమణ బాధితులు అందుకు భారీ మూల్యం చెల్లించారు.

Updated Date - 2023-10-13T01:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising