గరిష్ఠ వయస్సు పరిమితిని పెంచాలి
ABN, First Publish Date - 2023-10-28T04:26:15+05:30
ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు సంవత్సరాల నుండి గ్రూప్–2కి, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాలేదు. నిరుద్యోగులు ఎప్పటికైనా ఈ నోటిఫికేషన్స్ వస్తాయన్న ఆశతో...
ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు సంవత్సరాల నుండి గ్రూప్–2కి, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాలేదు. నిరుద్యోగులు ఎప్పటికైనా ఈ నోటిఫికేషన్స్ వస్తాయన్న ఆశతో గ్రూప్–2, గ్రూప్–1, డెప్యూటీ ఈఓ, లెక్చరర్స్ వంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలనే తపనతో ప్రిపరేషన్‌లో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీఓ 109 ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు పరిమితి 42 సంవత్సరాలు మాత్రమే.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఇవే ఉద్యోగాలకు పోటీపడే జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయసు పరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించింది.
మరి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు చేసిన పాపం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ సర్కార్ వలే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కూడా గరిష్ఠ వయస్సును 44 సంవత్సరములకు పెంచవలసిందిగా కోరుతున్నాము.
సూరిబాబు
విజయనగరం
Updated Date - 2023-10-28T04:26:15+05:30 IST