ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా

ABN, First Publish Date - 2023-05-07T03:05:52+05:30

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికీ కాంగ్రెసే ముందంజలో ఉందని సీ–ఓటరు తాజా సర్వే తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

110 నుంచి 122 సీట్లలో విజయం!

బీజేపీకి 73–85 స్థానాలు.. సీ–ఓటరు తాజా సర్వే వెల్లడి

బెంగళూరు, మే 6: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికీ కాంగ్రెసే ముందంజలో ఉందని సీ–ఓటరు తాజా సర్వే తెలిపింది. ఆ పార్టీ 110 నుంచి 122 స్థానాల్లో విజయం సాధించవచ్చని పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 స్థానాలు గెలుచుకోవాలి. ఈసారి కాంగ్రెస్‌కు 40.2 శాతం ఓట్లు రావచ్చని సర్వే తెలిపింది. ఇది 2018లో వచ్చిన ఓట్ల కంటే 2.2 శాతం ఎక్కువ. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చివరి విడత ఎన్నికల ప్రచారంలో కొంత పుంజుకుందని సర్వే పేర్కొంది. 73 నుంచి 85 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో 104 స్థానాలు సాధించింది. బీజేపీ గత ఎన్నికల్లో మాదిరిగానే 36 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేయడం ఆసక్తికరమైన విషయం. కర్ణాటకలో ఈ నెల 10న పోలింగ్‌ జరగనుంది.

Updated Date - 2023-05-07T21:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising