ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heart Care: గుండెకు చలి తిప్పలు.. బీ కేర్ ఫుల్ అంటున్న..!

ABN, First Publish Date - 2023-10-17T17:20:42+05:30

ఇంకా చలి పెరగకపోయినా, రాత్రుళ్తు తాపమానాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కొంతమందికి చలి ప్రభావం చేటు చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో కొమార్బిడ్‌ కోవకు చెందిన వాళ్లు అప్రమత్తంగా ఉండాలి.

ఇంకా చలి పెరగకపోయినా, రాత్రుళ్తు తాపమానాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కొంతమందికి చలి ప్రభావం చేటు చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో కొమార్బిడ్‌ కోవకు చెందిన వాళ్లు అప్రమత్తంగా ఉండాలి.

తాపమానాల్లో హెచ్చుతగ్గులు: తాపమానాల్లో వచ్చే తేడాలు శరీరంలోని హార్మోన్ల మీద ప్రభావం చూపిస్తాయి. అడ్రినలిన్‌, నారిటలిన్‌ అనే హార్మోన్లు లెవెల్స్‌ హఠాత్తుగా పెరిగి, రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వు ఒక్కసారిగా పగులుతుంది. ఇలా పగిలి, కొవ్వు కణాలు రక్తనాళాల్లో అడ్డంకిగా మారి రక్తప్రసారానికి అవరోధం కలిగిస్తాయి. ఫలితంగా గుండెకు సరిపడా రక్తప్రసారం జరగక గుండె పోటు వస్తుంది.

చలి ఒణుకు: చలికి ఒణుకు రావటం సహజం. ఇలా హృద్రోగులు వణకటం వల్ల శరీరంలోని హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఫలితంగా రక్తనాళాల్లోని కొవ్వు నిల్వలు కదిలి రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటు వస్తుంది.

పెరిగే రక్తపోటు: రక్తపోటు ఉన్న వాళ్లలో చలికాలం పెరిగే తరిగే ఉష్ణోగ్రతల వల్ల, బిపి కూడా ఒడిదొడుకులకు లోనవుతుంది. దాంతో రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం గుండె మీద పడి హృద్రోగాలు, గుండె పోట్లు వస్తాయి.

ఆస్తమా, సీవోపీడీ: ఈ కాలంలో ఆస్తమా, సీవోపీడీ సమస్యలు కూడా పెరుగుతాయి. ఈ సమస్యల వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి సరిపడా చేరుకోకపోవటం వల్ల ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గుతాయి. గుండె మీద ఒత్తిడి పెరిగి గుండెపోట్లు వస్తాయి.

అర్ధరాత్రి భోజనం: పెళ్లిళ్లు, వేడుకలకు హాజరవుతూ అర్ధరాత్రి ఆలస్యంగా భారీ భోజనం చేయటం మామూలే! ఉప్పు, మసాలాలు, కారాలు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారం తినటం ఆ ఆహారాన్ని అరిగించుకోవటం కోసం శరీరం అవసరానికి మించి కష్టపడాల్సి వస్తుంది. దాంతో గుండె మీద ఒత్తిడి పడి, గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

Updated Date - 2023-10-17T17:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising