ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Counselling: తిన్న వెంటనే అలా అవుతోంది? బయటపడే మార్గమేంటి?

ABN, First Publish Date - 2023-10-12T12:47:24+05:30

లేని సమస్యను ఉన్నట్టుగా ఊహించుకోవడం, దాంతో ఆందోళనను పెంచుకుని సమస్యను మరింత పెంచుకోవడం ‘ఎగ్జాజరేటెడ్‌ గ్యాస్ట్రిక్‌ కొలిక్‌ రిఫ్లక్స్‌’ సంబంధిత వ్యక్తుల తత్వం. ఈ సైకిల్‌ను బ్రేక్‌ చేయగలిగితే ఈ లక్షణం క్రమేపీ అదుపులోకి

డాక్టర్‌ నా వయసు 25 సంవత్సరాలు. కొంతకాలంగా నేనొక చిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్నప్పటికీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన వెంటనే మలవిసర్జనకు వెళ్లవలసి వస్తోంది. ఈ సమస్యతో నేను ఇంట్లో తప్ప, బయట ఎక్కడా ఏదీ తినలేకపోతున్నాను. దూర ప్రయాణాలు చేయవలసి వస్తే, తిన్న వెంటనే మలవిసర్జన అవుతుందనే భయంతో కడుపు మాడ్చుకోవలసి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం ఉందా?

- ఓ సోదరుడు, హైదరాబాద్‌

ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘ఎగ్జాజరేటెడ్‌ గ్యాస్ట్రిక్‌ కొలిక్‌ రిఫ్లక్స్‌’ అంటారు. సాధారణంగా పొద్దున నిద్ర లేచిన వెంటనే సాఫీగా, పూర్తిగా మలవిసర్జన జరగడం కోసం కడుపు నిండా నీళ్లు తాగమని చెప్తూ ఉంటారు. ఇలా నీళ్లు తాగడం వల్ల జీర్ణకోశం వ్యాకోచించి, పెద్ద పేగులు కుంచించుకుపోయి, మలవిసర్జన జరుగుతుంది. అయితే ఆందోళనకు గురైన సందర్భాల్లో, కొన్ని మందులు తీసుకుంటున్న వాళ్లలో ఈ పరిస్థితి సమస్యగా మారుతుంది. రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు మలవిసర్జనకు వెళ్లవలసి వస్తూ ఉంటుంది. పొట్ట కూడా గట్టిగా ఉంటుంది. అయితే ఇది వ్యాధి కాదు. ఇలా 90% మందికి జరుగుతూ ఉంటుంది. మిగతా 10ు మందిలో, పేగుల ఇన్‌ఫెక్షన్‌ లేదా ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌ ఉన్న వాళ్లలో కూడా ఈ సమస్య పదే పదే వేధిస్తూ ఉంటుంది. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్య లేకపోయినా తిన్న వెంటనే మలవిసర్జన చేయవలసి వచ్చే ఆరోగ్యకరమైన వ్యక్తులు దీన్నొక జబ్బుగా భావించి, మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అప్పటికే ఆందోళన, ఒత్తిడి సమస్య ఉన్న వాళ్లు ఈ సమస్యను భూతద్దంలో నుంచి చూస్తూ మరింత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దాంతో సమస్య మరింత ఎక్కువవుతుంది.

చికిత్స తేలికే!

లేని సమస్యను ఉన్నట్టుగా ఊహించుకోవడం, దాంతో ఆందోళనను పెంచుకుని సమస్యను మరింత పెంచుకోవడం ‘ఎగ్జాజరేటెడ్‌ గ్యాస్ట్రిక్‌ కొలిక్‌ రిఫ్లక్స్‌’ సంబంధిత వ్యక్తుల తత్వం. ఈ సైకిల్‌ను బ్రేక్‌ చేయగలిగితే ఈ లక్షణం క్రమేపీ అదుపులోకి వస్తుంది. ఈ ఆందోళన సంబంధిత ఫంక్షనల్‌ బోవెల్‌ డిజార్డర్‌ను కౌన్సెలింగ్‌తో, మందులతో సరిదిద్దవచ్చు. అలా కాకుండా పొట్టలో, పేగుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా పదే పదే మలవిసర్జన జరిగే వాళ్లలో బరువు తగ్గడం, పొట్ట నొప్పి, మలంలో రక్తం, విరోచనాలు లాంటి ఇతరత్రా లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఇలా తిన్న వెంటనే మలవిసర్జన జరగకుండా నియంత్రించుకోవడం కోసం కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అవేంటంటే....

  • ఉదయం పూర్తిగా మల విసర్జన జరిగేలా చూసుకోవాలి.

  • ఆహారంలో పీచు పదార్థాన్ని పెంచడం కోసం పండ్లు, కూరగాయల పరిమాణాన్ని పెంచాలి.

  • యోగా, ధ్యానం, వ్యాయామాలతో ఆందోళన, ఒత్తిడిలను తగ్గించుకోవాలి.

భరోసా పెంచే మందులు

ఈ నియమాలు పాటించినా కొంతమందిలో సమస్య అదుపులోకి రాకపోవచ్చు. అలాంటప్పుడు వాంతులను నియంత్రించడం కోసం వాడే, ‘ఆండెన్‌సెట్రాన్‌’ మాత్రలను నాలుగు రోజుల పాటు రోజుకు మూడు పూటలా భోజనానికి ముందు వాడుకోవచ్చు. అలాగే యాంగ్జయిటీని తగ్గించే మందులు, కౌన్సెలింగ్‌ కూడా అవసరం పడుతుంది. వాళ్లకున్నది సమస్య కాదని వివరించి, ఆత్మవిశ్వాసం పెంచగలిగితే, ఈ సమస్య అదుపులోకి వస్తుంది. సాధారణంగా గ్యాస్ట్రోఎంటరాలజి్‌స్టలే ఇలా మాటలతో భరోసా కల్పించి సమస్యను తొలగించేస్తూ ఉంటారు. కాబట్టి మీ సమస్యకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ కారణం కానట్లయితే, పైన చెప్పిన నియమాలు పాటించి చూడండి. అప్పటికీ తగ్గకపోతే వైద్యులను కలవండి.

-డాక్టర్‌ కె.ఎస్‌. సోమశేఖర రావు,

సీనియర్‌ కన్సల్టెంట్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

Updated Date - 2023-10-12T12:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising