ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Butter milk: అతిగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

ABN, First Publish Date - 2023-08-26T11:23:41+05:30

మజ్జిగ అనేక రోగాల నివారిణి. మన శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరగటానికి ప్రధానమైన కారణం మజ్జిగే! అయితే ‘‘అతి సర్వత్రా వర్జియేత్‌’’ అన్నట్లు మజ్జిగను కూడా అతిగా తాగటం మంచిది కాదు. దీని వల్ల ఊహించిన విధంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

మజ్జిగ అనేక రోగాల నివారిణి. మన శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరగటానికి ప్రధానమైన కారణం మజ్జిగే! అయితే ‘‘అతి సర్వత్రా వర్జియేత్‌’’ అన్నట్లు మజ్జిగను కూడా అతిగా తాగటం మంచిది కాదు. దీని వల్ల ఊహించిన విధంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

లేక్టోజ్‌ సమస్యలు: పాలు.. పెరుగులలో లేక్టోజ్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది కొందరికి పడదు. లేక్టోజ్‌ పడకపోతే కడుపునెప్పి.. అజీర్తి, విరోచనాల వంటి రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా చిన్నపిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సార్లు పెద్దవారికి కూడా లేక్టోజ్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఇదే విధంగా కొందరికి మజ్జిగలో ఉండే మిల్క్‌ ప్రొటీన్‌లు పడకపోవచ్చు. వీటి వల్ల చర్మంపై దద్దుర్లు వంటివి రావచ్చు. అందువల్ల మజ్జిగను అతిగా తాగకపోవటం మంచిది.

కేలరీలు కూడా: పాలతో పోలిస్తే మజ్జిగలో తక్కువ కేలరీలు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో రకరకాల రుచులున్న మజ్జిగలు మార్కెట్‌లోకి ప్రవేశించాయి. వీటిలో చక్కెరశాతం చాలా ఎక్కువ ఉంటోంది. అంటే కేలరీలు కూడా ఎక్కువే ఉంటాయి. అందువల్ల ఎక్కువ కేలరీలు ఉన్న మజ్జిగ తాగటం మంచిది కాదు.

ఉప్పు కూడా: చాలా మంది ఇంట్లో చేసిన మజ్జిగ కన్నా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బ్రాండెడ్‌ మజ్జిగను తాగటానికి ఇష్టపడతారు. దీనికి కారణం అది ఎక్కువగా రుచిగా ఉండటమే! ఇలా రుచిగా ఉండటానికి ఈ మజ్జిగలో ఎక్కువగా ఉప్పు, శోంఠి, కరివేపాకు పొడి మొదలైనవి కలుపుతారు. ఇవి కొందరికి పడవు.

Updated Date - 2023-08-26T11:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising