Iron character: ఇనప మూకుడులో వంట చేస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
ABN, First Publish Date - 2023-09-25T11:57:40+05:30
మన శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ (Iron) విలువలు సక్రమంగా ఉంటేనే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. లేకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ ఐరన్
మన శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ (Iron) విలువలు సక్రమంగా ఉంటేనే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. లేకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ ఐరన్ విలువలను సక్రమంగా ఉంచుకోవటానికి ఒక మార్గం- ఇనుప మూకుడులో వంటలు వండుకోవటం. ఇనుప మూకుడులో వంట వండినప్పుడు- దానిలోని కొంత ఇనుము ఆహారంలోకి చేరుతుంది. అమెరికన్ డయాబెటిక్ అసోషియేషన్ చేసిన అధ్యయనాల్లో ఇనుప మూకుడులలో వంట వండితే- ఆ ప్రభావం ఆహారంపై ఉంటుందని తేలింది. అందువల్ల ఇనుమ మూకుడులో వంట వండటం మంచిదేనని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించమని సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.
ఇనుమ మూకుడులో నిమ్మరసం లేదా వెనిగర్ ఉపయోగించే వంటలను వండవద్దు. దీని వల్ల ఆహారపదార్థాలకు ఇనుప వాసన వస్తుంది.
వంట వండిన తర్వాత ఆహారపదార్థాలను మూకుడులో వదిలేయవద్దు. సాధారణంగా ఇనుప మూకుడు చాలా ఎక్కువ సమయం వేడిగా ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని దానిలో వదిలేస్తే మాడిపోయే అవకాశముంటుంది.
ఇనుప మూకుడును ఉప్పు లేదా బేకింగ్ సోడా వేసి తోమాలి. బాగా తోమిన తర్వాత- కొద్దిగా నూనె వేసి గుడ్డతో తుడవాలి. దీని వల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది.
Updated Date - 2023-09-25T11:57:40+05:30 IST