Kidney care: కిడ్నీల మీద ఓ కన్నేసి ఉంచండి.. లేదంటే..!
ABN, First Publish Date - 2023-05-23T12:37:05+05:30
బ్లడ్ గ్రూప్‌తో పని లేని కిడ్నీ మార్పిడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే కిడ్నీ మార్పిడి సాధ్యపడే పరిస్థితి పూర్వం ఉండేది. కానీ ఇప్పుడు
కిడ్నీ కాపాడుకోవాలంటే...
స్మోకర్ల మూత్రపిండాల సామర్ధ్యం వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి నికోటిన్ కలిగి ఉండే ధూమపానం, గుట్కా, పాన్ మసాలాలను మానేయాలి.
కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్లు పెయిన్ కిల్లర్స్‌కు దూరంగా ఉండాలి.
ఏ రుగ్మత కోసం వైద్యులను సంప్రతించినా, తమకున్న కిడ్నీ జబ్బు గురించి చెప్పాలి.
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి మూత్రపిండాల పనితీరును పరీక్షించుకుంటూ ఉండాలి.
కుటుంబ చరిత్రలో కిడ్నీ సమస్య ఉన్నవాళ్లు, హృద్రోగులు, మధుమేహులు, హై బిపి ఉన్న వాళ్లు కూడా ఏడాదికోసారి కిడ్నీలను పరీక్షించుకుంటూ ఉండాలి.
రోజు మొత్తంలో తీసుకునే ఉప్పును 3 నుంచి 4 గ్రాములకు తగ్గించాలి.
వారంలో ఐదు రోజుల పాటు, రోజుకు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
బరువును అదుపులో ఉంచుకోవాలి.
కొవిడ్‌తో కిడ్నీ జబ్బుకుకు గురైనవాళ్లు ప్రతి మూడు నెలలకోసారి మూత్రంలో ప్రొటీన్ నష్టాన్ని గమనించుకుంటూ ఉండాలి. కిడ్నీ పనితీరును పరీక్షించుకుంటూ, దాని సామర్ధ్యాన్ని కాపాడుకునే జాగ్రత్తలు పాటించాలి.
కిడ్నీ సమస్య తీవ్రంగా ఉన్న వాళ్లు ప్రొటీన్ పరిమితి పాటించాలి.
రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.
బ్లడ్ గ్రూప్‌తో పని లేని కిడ్నీ మార్పిడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే కిడ్నీ మార్పిడి సాధ్యపడే పరిస్థితి పూర్వం ఉండేది. కానీ ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా, కిడ్నీ మార్పిడి సాధ్యపడుతోంది. ఇందుకోసం స్వీకర్త శరీరంలోని యాంటీబాడీలను లెక్కించి, ప్లాస్మా ప్రొసిజర్ ద్వారా యాంటీబాడీల పరిమాణాన్ని క్రమేపీ తగ్గించి, కొత్తవి ఉత్పత్తి కాకుండా సర్జరీకి ముందు నుంచే ఇంజెక్షన్ ఇచ్చి, కిడ్నీ మార్పిడి చేయడం జరుగుతుంది. అలాగే అవసరాన్ని బట్టి సర్జరీ తర్వాత కూడా ప్లాస్మా ప్రొసిజర్ చేయవలసి వస్తుంది. కిడ్నీ మార్పిడి చేసిన నెల తర్వాత శరీరంలో యాంటీబాడీలు పెరిగినా కిడ్నీకి ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి సర్జరీకి ముందు, సర్జరీ చేసిన కొన్ని రోజుల వరకూ యాంటీబాడీలు పెరగకుండా చూసుకుంటే, కిడ్నీ మార్పిడి విజయవంతమవుతుంది.
Updated Date - 2023-05-23T12:37:05+05:30 IST