కాటుక పెట్టేటప్పుడు ఈ పొర్లపాటు చేయకండి! లేదంటే..!
ABN, First Publish Date - 2023-06-22T13:47:55+05:30
కళ్లు అందంగా కనపడాలంటే.. కాటుక ఉండాల్సిందే. ఇపుడు మార్కెట్లో ఆర్గానిక్, రోజ్ బేస్డ్, హెర్బల్, జెల్‌బేస్డ్ కాటుకలు దొరుకుతున్నాయి. ముఖ్యంగా కాజల్ పెట్టుకునేప్పుడు ఎలాంటి పొరబాట్లు చేయకూడదు.
కళ్లు అందంగా కనపడాలంటే.. కాటుక ఉండాల్సిందే. ఇపుడు మార్కెట్లో ఆర్గానిక్, రోజ్ బేస్డ్, హెర్బల్, జెల్‌బేస్డ్ కాటుకలు దొరుకుతున్నాయి. ముఖ్యంగా కాజల్ పెట్టుకునేప్పుడు ఎలాంటి పొరబాట్లు చేయకూడదు.
● సరిగా కాటుక పెట్టకుంటే అందం అంతా చెడిపోతుంది. ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. మూడ్ కూడా పాడవుతుంది. అందుకే హడావిడిగా ఉన్నప్పుడు కాటుక పెట్టకండి. కాస్త కూల్‌గా ఉన్నప్పుడే కాటుక జోలికి వెళ్లండి.
● కాటుక దిద్దే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. మెత్తని గుడ్డతో తుడవాలి. శుభ్రం చేసిన తర్వాత కూడా కళ్ల కింద ఆయిల్ కనపడుతుంటే వేలితో పౌడర్‌ను రాసిన తర్వాత కాటుక పెడితే ఎక్కువ సమయం ఉంటుంది.
● లోకల్ మార్కెట్లో లభించేది కాకుండా.. నాణ్యత ఉండే కాజల్‌నే వాడండి. మీ కళ్లు మరీ పెద్దవిగా ఉంటే మాత్రం సింగిల్ లైనర్‌తోనే మంచి లుక్‌ను పొందవచ్చు.
● ఇక మీ కళ్లు మరీ చిన్నగా ఉంటే.. లోపలి వైపు నుంచి బయటకు తీసుకెళ్తూ ఎక్కువగా హైలైట్ చేయాలి. లేదా దానిమీద లేయరింగ్ వేయాలి.
● కాజల్ విషయంలో ఏదోటిలే అని రాజీపడితే కళ్లకు ప్రమాదమని గుర్తుంచుకోండి.
● స్మోకీలుక్ కోసం రంగును బ్లెండ్ చేయటం, షాడోలు ఇవ్వటం చేయవచ్చు. అయితే ప్రయోగాలు మాత్రం చేయకండి మేకప్ వేసేవాళ్లు, నిపుణుల పర్యవేక్షణలోనే కాజల్‌ను దిద్దుకోండి.
● మీ దగ్గర ఉండే కాజల్‌ను ఇతరులకు ఇవ్వకండి. ఇలా చేస్తే బ్యాక్టీరియా అందులో వుంటే కళ్లకు వ్యాపించే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.
● ఏదేమైనా మేకప్ సరిగా ఉంటేనే కాజల్‌కు మరింత అందం వస్తుంది. ఒకవేళ మేకప్ లేకున్నా.. కూల్‌గా కాజల్ రాసుకోవటం వల్లనూ కళ్లు అందంగా కనిపిస్తాయి. అతిగా, కళ్లచివరల కూడా రాయటం వల్ల కళ్ల సమస్యలు వస్తాయి. దీంతో పాటు చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది.
Updated Date - 2023-06-22T13:47:55+05:30 IST