ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allergy: అలర్జీతో బాధపడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి

ABN, First Publish Date - 2023-09-01T12:11:24+05:30

డాక్టర్‌. నా వయసు 25 ఏళ్లు. ఉదయం నిద్ర లేచిన వెంటనే వరుసగా తుమ్ములు మొదలవుతున్నాయి. ఇది అలర్జీ లక్షణమా? ఈ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

డాక్టర్‌. నా వయసు 25 ఏళ్లు. ఉదయం నిద్ర లేచిన వెంటనే వరుసగా తుమ్ములు మొదలవుతున్నాయి. ఇది అలర్జీ లక్షణమా? ఈ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

- ఓ సోదరి, నెల్లూరు.

ముక్కు, గొంతు, చెవులకు సంబంధించిన అలర్జీ లక్షణాలు, తత్వాలు భిన్నంగా ఉంటాయి. కొందరిని వానాకాలం, చలికాలం అలర్జీలు వేధిస్తే, ఇంకొందరినీ ఏడాదంతా అలర్జీలు వేధిస్తాయి. కాబట్టి అలర్జీ కారకాలతో పాటు అలర్జీ రకాన్ని వాటికి తగ్గట్టు చికిత్స ఎంచుకోవాలి. అలర్జీ లక్షణాలు భిన్నంగా ఉంటాయి.

1 ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆగకుండా 20 నుంచి 30 తుమ్ములు

2 ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం

3 మాట్లాడేటప్పుడు, రాత్రి వేళల్లో దగ్గు ఎక్కువవుతూ ఉండడం

వీటికి దూరం అవసరం

అలర్జీలకు పరిష్కారం ఆయా కారకాలకు దూరంగా ఉండడమే! మీకున్న తుమ్ముల సమస్య తగ్గాలంటే మొదట ఈ జాగ్రత్తలు పాటించాలి.

1 ఉదయం ఏడు గంటలకు ముందు, సాయంత్రం ఏడు గంటల తర్వాత చల్లని వాతావరణానికి బహిర్గతం కాకూడదు

2 ముక్కుకు మాస్క్‌ ధరించాలి.

3 చల్లని నీళ్లు, పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి.

4 ఫుడ్‌ అలర్జీ ఉంటే, ఏ పదార్థాలు కారణమో

తెలుసుకుని, వాటికి దూరంగా ఉండాలి.

చికిత్స ఇలా...

అలర్జీ వేధించే కాల పరిమితి, తీవ్రతల ఆధారంగా మందులు తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఆ మందులకు స్పందించే తీరును బట్టి తగిన యాంటీహిస్టమిన్లను ఎంచుకోవలసి ఉంటుంది. ఏ మందులను, ఎంత కాలం పాటు, ఎంత మోతాదులో వాడుకోవాలో వైద్యులు మాత్రమే నిర్ణయించగలుగుతారు. కాబట్టి అలర్జీలకు సొంత వైద్యం మీద ఆధారపడకుండా వైద్యులను కలిసి సమర్థమైన చికిత్స తీసుకోండి.

-డాక్టర్‌ టి. సుధీర్‌ రెడ్డి

కన్సల్టెంట్‌ ఇ.ఎన్‌.టి, హెడ్‌

అండ్‌ నెక్‌ సర్జన్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-09-01T12:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising