ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Turkey Earthquake : గడ్డ కట్టే చలిలో కూతురి చేయి పట్టుకుని కూర్చొన్నాడు.. బతికుందేమోనన్న చిన్న ఆశ

ABN, First Publish Date - 2023-02-11T08:30:34+05:30

టర్కీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 20 వేల మంది మృతి చెందారు. ఇక జీవించి ఉన్న వారిది సైతం ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. కొన్ని చిత్రాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అలాంటి చిత్రమే ఒకటి ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Turkey Earthquake : టర్కీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 20 వేల మంది మృతి చెందారు. ఇక జీవించి ఉన్న వారిది సైతం ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. కొన్ని చిత్రాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అలాంటి చిత్రమే ఒకటి ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది.అసలు ఆ ఫోటో ఏంటంటే.. తండ్రి తన కూతురి చేతిని పట్టుకుని ఉన్నది. దానిలో ఏముందంటారా? ఆయన కూతురు శిథిలాల కింద నలిగిపోయి ఉంది. ఒక్క చేయి మాత్రం బయటకు కనిపిస్తోంది. బతికుందో లేదో తెలియదు.. కానీ బతికుంటే బాగుండనే ఆశ.. ఆ తండ్రి కళ్లలో కొండంత ఉప్పెన దాగుంది.

ఆ తండ్రి దగ్గరకు వెళ్లే సాహసాన్ని చేయలేకపోయారు..

ఆయన పేరు మెసుట్ హాన్సర్.. టర్కీ భూకంపం ధాటికి ఆయన నివసించిన ఇల్లు నేలమట్టమైంది. గడ్డకట్టే చలిలో తన నివాసం వద్ద విరిగిన ఇటుకల కుప్పపై ఒంటరిగా కూర్చొన్నాడు. అతని కూతురి పేరు ఇర్మాక్ (15). విరిగిపడిన శిథిలాల నుంచి ఇర్మాక్ చేయి మాత్రమే బయటకు కనిపిస్తోంది. కూతురు బతికుందేమోనన్న ఆశతో ఆమె చేతిని విడువకుండా పట్టుకున్నాడు. ఎవ్వరినీ పట్టించుకోలేదు. ఒంటరిగా కుమిలిపోయాడు. ఇర్మాక్ ఇక లేదన్న విషయం ఆయనను నమ్మనివ్వడం లేదు. అల్టాన్ అనే ఫోటో గ్రాఫర్ ఘటనా స్థలానికి వెళ్లే సమయానికి కనిపించిన దృశ్యమిది. కానీ అల్టాన్ ఆ తండ్రి దగ్గరకు వెళ్లే సాహసాన్ని చేయలేకపోయారు. 200 అడుగుల దూరం నుంచి హాన్సర్‌ను ఫోటో తీసేందుకు యత్నించాడు. కానీ అల్టాన్‌ని హాన్సర్ పిలిచాడు. గద్గద స్వరంతో తన బిడ్డ చిత్రాన్ని తీయాలని కోరాడు.

గుండె బరువెక్కింది.. ఏడుపు ఆపుకోలేకపోయా..

ఆ సమయంలో తనకు మాటలు రాలేదని అల్టాన్‌ స్థానిక మీడియాకు తెలిపారు. తన దేశంతో పాటు ప్రపంచమంతా తన పరిస్థితిని చూడాలని ఆయన భావించాడు. ఈ ఫోటో ప్రపంచంలోని ప్రధాన వార్తా పత్రికలన్నింటిలో కనిపించింది. ‘‘నేను ఈ ఫోటో తీస్తున్నప్పుడు చాలా బాధపడ్డాను. గుండె బరువెక్కింది. ఏడుపు ఆపుకోలేకపోయాను. పదే పదే నాకు నేనే ధైర్యం చెప్పుకోవాల్సి వచ్చింది. అని అల్టాన్ వెల్లడించారు. అతి కష్టం మీద మాట్లాడుతున్న హాన్సర్‌తో ఎక్కువగా మాట్లాడలేకపోయాను. ఆ ఫోటోపై ప్రపంచం నుంచి వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫోటోను ఆన్‌లైన్‌లో కొన్ని వేల మంది షేర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నాకు కొన్ని వేల సందేశాలు వచ్చాయి. ఈ చిత్రాన్ని జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేమని చాలా మంది నాతో చెప్పారు’’ అని అల్టాన్ పేర్కొ్న్నారు.

Updated Date - 2023-02-11T08:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising