Turkey Another Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం...34వేలకు చేరిన మృతుల సంఖ్య
ABN, First Publish Date - 2023-02-13T10:06:53+05:30
టర్కీ దేశంలో మరోసారి భూకంపం సంభవించింది....
కహ్రామన్మరాస్(టర్కీ): టర్కీ దేశంలో మరోసారి భూకంపం సంభవించింది.(Turkey Another Earthquake) ఆదివారం రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో తాజా భూప్రకంపనలు టర్కీని కుదిపేశాయి.(Fresh tremor jolts) భూకంప కేంద్రం కహ్రామన్మరాస్(Kahramanmaras) సమీపంలో నమోదైంది.టర్కీ, సిరియా దేశాల్లో గతంలో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో సంభవించిన విధ్వంసక భూకంపం జరిగిన వారం తర్వాత ఆదివారం టర్కీలో 4.7 తీవ్రతతో మళ్లీ భూకంపం సంభవించింది.
ఇది కూడా చదవండి : Earthquake: ఆఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ కలకలం...ఫైజాబాద్‌లో భూకంపం
దక్షిణ నగరమైన కహ్రామన్మరాస్ భూకంపం వల్ల బాగా దెబ్బతింది.మళ్లీ సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదించింది. టర్కీ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 34,000 దాటింది. భూకంప మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : Triple Talaq : భార్యకు ట్రిపుల్ తలాఖ్...విమానాశ్రయంలో భర్త అరెస్ట్
1939వ సంవత్సరం తర్వాత టర్కీని తాకిన అత్యంత ఘోరమైన భూకంపం విపత్తుగా నిలిచింది. విపత్తు కారణంగా అంటక్యాలో భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం అనంతరం సామూహిక శ్మశానవాటికలో 5వేల మృతదేహాలను ఖననం చేశారు. టర్కీ, సిరియా సరిహద్దు సమీపంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా టర్కీలోని హటే ప్రావిన్స్‌లోని విమానాశ్రయం యొక్క రన్‌వే రెండుగా విడిపోయింది.
Updated Date - 2023-02-13T10:06:55+05:30 IST