Turkeyలో ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగానే.. మరో భూకంపం
ABN, First Publish Date - 2023-02-07T11:27:59+05:30
టర్కీ - సిరియాలో భూకంపం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. సోమవారం తెల్లవారుజామున రెండు దేశాలలో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లను సైతం నేలమట్టం చేసింది.
Turkey Earthquake : టర్కీ - సిరియాలో భూకంపం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. సోమవారం తెల్లవారుజామున రెండు దేశాలలో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లను సైతం నేలమట్టం చేసింది. ఆసుపత్రులను ధ్వంసం చేసింది. వేలకొద్ది ప్రజానీకం భూ సమాధి అయ్యింది. వేలాది మంది ప్రజానీకం నిరాశ్రయులయ్యారు. వేలాది మంది గాయపడ్డారు. హుటాహుటిన రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే నేటి (మంగళవారం) ఉదయం మరోమారు సెంట్రల్ టర్కీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇదిలా ఉండగా.. టర్కీకి సాయం చేసేందుకు భారత్ సహా మరికొన్ని దేశాలు ముందుకొచ్చాయి. సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ప్రకటించింది. ఆ వెంటనే అంటే కొద్ది గంటల వ్యవధిలోనే భారత వైమానిక దళ విమానంలో సహాయక బృందాలు బయల్దేరాయి. నిపుణులైన జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలు, అత్యంత నైపుణ్యంగల జాగిలాల స్క్వాడ్స్, ఔషధాలు, అడ్వాన్స్‌డ్ డ్రిల్లింగ్ ఎక్విప్‌మెంట్, సహాయక చర్యలకు అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు వీటిలో ఉన్నాయి. టర్కీకి బయలుదేరిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందంలో మహిళలు కూడా ఉండటం విశేషం.
Updated Date - 2023-02-07T11:29:48+05:30 IST