Israel–Hamas war: ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో 21 మంది జర్నలిస్టుల మృతి
ABN, First Publish Date - 2023-10-21T15:23:19+05:30
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Palestine) ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భీకర బాంబుల దాడుల్లో 21 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్(CPJ) వెల్లడించింది.
గాజా: ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Palestine) ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భీకర బాంబుల దాడుల్లో 21 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్(CPJ) వెల్లడించింది. మృతుల్లో 18 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు ఇజ్రాయిల్ జర్నలిస్టులు(Journalists) ఉన్నారు. ఇజ్రాయిల్ దాడులతో 15 మంది, హమాస్ దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 8 మంది జర్నలిస్టులు గాయపడ్డారు. మరో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. 15 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రొగ్రామ్ కోఆర్డినేటర్ షెరిఫ్ మన్సూర్ కోరారు.
వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 4 వేలకుపైగా ప్రాణాలు కోల్పోయారు. 12 వేల మందికి పైగా గాయపడ్డారు. హమాస్ టెర్రరిస్టులు 203 మందిని బందీలుగా చేసుకున్నట్లు సమాచారం. ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) మాట్లాడుతూ.. విజయం సాధించే వరకు హమాస్ తో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హమాస్ టెర్రరిస్టుల అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. మరణించిన జర్నలిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇరువైపుల నుంచి వైమానిక దాడులు జరగడంతో రెండు ఏరియాల్లో చాలా ప్రాంతాలు పూర్తిగా నాశయమయ్యాయి. హమాస్ దాడిలో 1,400కుపైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడిలో 4 వేలకు పైగా గాజా పౌరులు ప్రాణాలు విడిచారు. మరోవైపు గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిలో చాలా మంది ప్రాణాలతోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను సైతం గాజా స్ట్రిప్‌కు తరలించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. నిన్న ఇద్దరు అమెరికన్ పౌరుల్ని హమాస్ విడిచిపెట్టి.. ఇజ్రాయెల్ కు అప్పగించింది.
Updated Date - 2023-10-21T15:24:04+05:30 IST