ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Benjamin Netanyahu: హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్.. యుద్ధానికి దిగితే లెవనాన్ వినాశనమే!

ABN, First Publish Date - 2023-10-22T21:39:01+05:30

లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హిజ్బుల్లా’ ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అది హమాస్‌కి మద్దతుగా...

లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హిజ్బుల్లా’ ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అది హమాస్‌కి మద్దతుగా ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంత సరిహద్దుపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆ ఉగ్రవాద సంస్థకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్‌కు మద్దతుగా హిజ్బుల్లా యుద్ధానికి దిగితే.. కలలో కూడా ఊహించని స్థాయిలో ప్రతిదాడులు చేస్తామన్నారు.

లెబనీస్ సరిహద్దు దగ్గర ఇజ్రాయెల్ కమాండోలకు బెంజిమన్ నెతన్యాహు బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగానే ఆయన హిజ్బుల్ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో హిజ్బుల్లా పూర్తిగా ప్రవేశించాలని అనుకుంటుందో, లేదో అనేది నేను ఇప్పుడే చెప్పలేను. ఒకవేళ అది ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగితే మాత్రం.. ఊహించలేని శక్తితో విధ్వంసం సృష్టిస్తాం. లెబనాన్‌ను వినాశనమవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. లెబనాన్ మొత్తం సర్వనాశనం అయ్యేలా బాంబుల వర్షం కురిపిస్తామంటూ హెచ్చరించారు.


అంతకుముందు ఇజ్రాయెల్ ఆర్మీతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ సైతం హిజ్బుల్లాకు వార్నింగ్ ఇచ్చారు. హమాస్‌కి మద్దతుగా హిజ్బుల్లా తమతో యుద్ధానికి దిగితే మాత్రం.. అది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తేల్చి చెప్పారు. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలోకి లెబనాన్‌ని అనవసరంగా లాగొద్దని సూచించారు. లెబనాన్ శ్రేయస్సు, సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకొని.. సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచించారు. లేకపోతే.. ఊహించని పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు.

ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన హమాస్ మెరుపుదాడులు చేసినప్పుడు బెంజిమన్ ఆ సంస్థను సర్వనాశనం చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగినట్టుగానే ఇజ్రాయెల్ బలగాలు దూసుకుపోతున్నాయి. హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. హమాస్ రహస్య స్థావరాల్ని చీడపురుగుల్లా వెతికి మరీ దాడులకు పాల్పడుతున్నారు. దీనికితోడు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి, స్పెషల్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తోంది ఇజ్రాయెల్.

Updated Date - 2023-10-22T21:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising