ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRICS Summit: అరెస్టు భయంతో పుతిన్ దక్షిణాఫ్రికా పర్యటన రద్దు

ABN, First Publish Date - 2023-07-19T21:21:05+05:30

జోహానెస్‌బర్క్‌లో జరుగనున్న బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ హాజరు కావడం లేదు. ఉక్రెయిన్‌పై పుతిన్ చర్యల కారణంగా ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గత మార్చిలో అరెస్టు వారెంటు జారీ చేసింది. పుతిన్‌ బ్రిక్స్ సదస్సుకు వస్తే ఆయనను దక్షిణాఫ్రికా అరెస్టు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది.

కేప్‌టౌన్: జోహానెస్‌బర్క్‌లో (Johannesburg)లో ఆగస్టు 22-24 తేదీల్లో జరుగనున్న బ్రిక్స్ (BRICS) సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ (Vladmir Putin) హాజరు కావడం లేదు. ఆయన స్థానే ఆ దేశ అధ్యక్షుడు సెర్గీ లావ్రోవ్ (Sergey Lavrov) వెళ్తున్నారు. ఉక్రెయిన్‌పై పుతిన్ చర్యల కారణంగా ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) గత మార్చిలో అరెస్టు వారెంటు జారీ చేసింది. పుతిన్‌ బ్రిక్స్ సదస్సుకు వస్తే ఆయనను దక్షిణాఫ్రికా అరెస్టు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరుకావడం లేదని దక్షిణాఫ్రికా వెల్లడించింది. పుతిన్‌ను బ్రిక్స్ సదస్సుకు హాజరుకావద్దంటూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస మంగళవారంనాడు కోరారు. ఆ మరుసటి రోజే పుతిన్ రావడం లేదంటూ దక్షిణాఫ్రికా ప్రకటించడం విశేషం.


ఉక్రెయిన్‌ నుంచి పిల్లల అహరణకు సంబంధించిన యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంటు జారీ చేసినందున ఆయన జోహానెస్‌బర్గ్ వస్తే కోర్టు ఆదేశాలను దక్షిణాఫ్రికా పాటించక తప్పనిసరి అవుతుంది. అదే జరిగితే రష్యాతో యుద్ధాన్ని ప్రకటించినట్టే అవుతుందని దక్షిణాఫ్రికా ఆందోళన చెందుతోంది. రష్యాతో యుద్ధం అనేది దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని కూడా చెబుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యాతో శాంతి యత్నాలు తాము జరుపుతున్నామని, అలాంటప్పుడు ఆయనను అరెస్టు చేయాల్సి వస్తే తమ శాంతి యత్నాలకు భంగం వాటిల్లుతుందని అంటోంది. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా భాగస్వాములుగా ఉన్నాయి.

Updated Date - 2023-07-19T21:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising