ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China: పుతిన్‌కు అరెస్టు వారెంట్‌ జారీ చేయడంపై తొలిసారి స్పందించిన చైనా..

ABN, First Publish Date - 2023-03-20T19:28:08+05:30

రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్లు జారీ చేయడంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బీజింగ్: రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్(Vladimir Putin)కు అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) అరెస్టు వారెంట్లు జారీ చేయడంపై చైనా తొలిసారి స్పందించింది. పుతిన్‌కు అరెస్టు వారెంట్లపై ''నిష్పాక్షిక వైఖరి'' ప్రదర్శించాలని ఐసీసీని కోరింది. మూడు రోజుల పర్యటన కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) సోమవారంనాడు రష్యా చేరుకున్న తరుణంలో బీజింగ్ తాజా ప్రకటన చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టినప్పటి నుంచి ఆక్రమిత ప్రాంతాల్లోని పిల్లలను రష్యాకు చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు పాల్పడిందని, ఇందుకు పుతిన్ బాధ్యుడని పేర్కొంటూ ఐసీసీ ఆయనకు ఈనెల 17న అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఇందుకు దీటుగా రష్యా స్పందించింది. ఐసీసీని తాము గుర్తించడం లేదని, ఐసీసీ చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రష్యాకు చైనా బాసటగా నిలిచింది.

''ఐసీసీ నిష్పాక్షికంగా వ్యవహరించాలి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అరెస్టుల వ్యవహారంలో దేశాధినేతలకు ఉన్న ఇమ్యూనిటీని గౌరవించాలి. రాజకీయాలకు దూరంగా ఐసీసీ ఉండటంతో పాటు ద్వంద్వ వైఖరిని విడనాడాలి'' అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ (Wong Wenbin) కోరారు. చైనాకు జిన్‌పింగ్ చేరుకోవడానికి కొద్ది గంటల ముందే ఆయన ఈ ప్రకటన చేశారు. జిన్‌పింగ్ రష్యా పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సమావేశం జరుపనున్నారు. ఉక్రెయిన్‌తో శాంతి ప్రణాళిక గురించి ఉభయులూ చర్చించే అవకాశం ఉంది. జిన్‌పింగ్ మూడు రోజల పర్యటన ఫలితంపై ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Updated Date - 2023-03-20T19:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising