ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nepal Plane crash: 68కి పెరిగిన విమాన ప్రమాద మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2023-01-15T19:23:40+05:30

ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. ఘటన నేపథ్యంలో నేపాల్‌లో సోమవారం సంతాపదినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Nepal Aircraft crash
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాట్మండు: నేపాల్‌(Nepal)లో యెటి ఎయిర్‌లైన్స్‌ (Yeti airlines)కు చెందిన ఏటీఆర్-72 విమానం పోఖారా విమానాశ్రయం(Pokhara airport)లో కుప్పకూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 68కి పెరిగింది. ఇప్పటివరకూ 68 మృతదేహాలను వెలికితీశామని నేపాల్ పౌర విమానయాన శాఖ(Nepal Civil Aviation authority) ప్రకటించింది. ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. ఘటన నేపథ్యంలో నేపాల్‌లో సోమవారం సంతాపదినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక లోపం వల్లే విమానం కుప్పకూలిందని అంచనా వేశారు.

విమానం కూలిన సమయంలో విమానంలో నలుగురు సిబ్బంది, 68 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఒకరు ఐరిష్, ఇద్దరు కొరియన్లు, అర్జంటైనా జాతీయుడొకరు, ఫ్రెంచ్ జాతీయుడొకరు ఉన్నారు. ఈ విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 10.33 గంటలకు బయల్దేరింది. ఖాట్మండు నుంచి పోఖారా వెళ్తుండగా సేతి గండకి నది పరీవాహక ప్రాంతంలోని అటవీ ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగింది.

నేపాల్‌లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విమానం కుప్పకూలిపోవడానికి ముందు తన దిశను కోల్పోయినట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. కుప్పకూలిపోవడానికి కొద్ది సెకండ్ల ముందు ఆ విమానం తలక్రిందులవుతున్నట్లుగా ఒరిగిపోవడం కనిపించింది. ఈ విమానాశ్రయానికి సమీపంలోని ఓ భవనంపై నుంచి ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

Updated Date - 2023-01-15T19:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising